విజయవాడ : ఐదు దశాబ్దాలపాటు ఏకధాటిగా జర్నలిస్టుల ఉద్యమమే ఊపిరిగా, జర్నలిస్ట్
సంఘమే జీవితంగా, పాత్రికేయుల సంక్షేమమే లక్ష్యంగా అవిశ్రాంతంగా పాటుపడిన
మహానేత అంబటి ఆంజనేయులు అని జర్నలిస్టుల అగ్రనేతలు అన్నారు. ఐజేయూ స్టీరింగ్
కమిటీ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే గౌరవ సలహాదారులు అంబటి ఆంజనేయులు సంస్మరణ సభ
సోమవారం ఘనంగా జరిగింది. అంబటి ఆకస్మిక మృతితో ఆంధ్రప్రదేశ్ పత్రికారంగం,
ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమానికి తీరనిలోటన్నారు. ఆంధ్రప్రదేశ్
వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఒక పెద్దదిక్కును కోల్పోయిందన్నారు. వర్కింగ్
జర్నలిస్ట్ ఉద్యమంలో విజయవాడ అంటే గుర్తుకొచ్చే మొదటి పేరు అంబటి అంజనేయులు
అనేంతగా ఆయన సమాయాన్ని వెచ్చించి పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు
ప్రెస్ క్లబ్, జర్నలిస్ట్ యూనియన్ తప్ప వేరే వ్యాపకాలు లేకపోవడం యూనియన్
చేసుకున్న అదృష్టమన్నారు. విజయవాడలో ఆయనకున్న బలమైన పరిచయాలకు, స్నేహాలకు, ఆయన
ఎలాంటి సమస్య అయినా ఎంతో సునాయాసంగా పరిష్కారించే వారున్నారు. నీతి, నిజాయితీ
నిబద్ధతతో ఆయన యూనియన్ కు కట్టుబడి పనిచేశారని తెలిపారు. జర్నలిస్టులకు
ఉద్యోగపరంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అండగా
నిలబడే వ్యక్తి ఆంజనేయులు అని తెలిపారు. జర్నలిస్టులు కాని వారి కుటుంబ
సభ్యులు కాని అనారోగ్యం పాలైనప్పుడు వారి వెంట ఉండి అస్పత్రులకు
తీసుకువెళ్లడం, డాక్టర్లతో మాట్లాడటం, మంచి వైద్యం అందేటట్లు చూడటం, బిల్లులు
తగ్గించేటట్లు మాట్లాడటం వంటివి అంజనేయులు దినచర్యలో భాగంగా నిలిచేదన్నారు.
ఇచ్చారు. జర్నలిస్టు అగ్రనేతలు రామమోహనరావు, సి. రాఘవాచారి, శివలెంక
శంభూప్రసాద్, శివలెంక రాధాకృష్ణ, నీలంరాజు వెంకట శేషయ్య, కూచిమంచి సత్య
సుబ్రహ్మణ్యం, పొత్తూరి వెంకటేశ్వరరావు వంటి ఉద్దండ సంపాదకులు పనిచేస్తున్న
కాలంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమానికి అంబటి అంజనేయులు నాయకత్వం వహించడం
చిరస్మరణీయమన్నారు. ప్రధానంగా జర్నలిస్టులకు, సంపాదకులకు, యాజమాన్యాలకు మధ్య
వారధిగా నిలబడ్డారని ఆయన సేవలను కొనియాడారు. తొలుత ప్లాంట్ యూనియన్లు సంఘటితం
కోసం రాష్ట్ర అధ్యక్షునిగా నాన్ జర్నలిస్టుల సంక్షేమానికి ఆంధ్రప్రభ, ఇండియన్
ఎక్స్ ప్రెస్ విశేషకృషి చేశారని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర
ప్రధానకార్యదర్శిగా, అధ్యక్షునిగా రెండుసార్లు ఎన్నికయ్యారని, అప్పట్లో జరిగిన
ఉద్యమాలకు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర
అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అధ్యక్షత జరిగిన ఈ సంస్మరణ సభలో ఐజేయూ జాతీయ
అధ్యక్షులు కే శ్రీనివాస రెడ్డి, ప్రజాశక్తి ఎడిటర్ తులసీదాసు ఐజేయూ
సెక్రెటరీ జనరల్ బల్విందర్ జమ్ము , రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు
దేవులపల్లి అమర్, మాజీ మంత్రి పేర్ని నాని, సీనియర్ జర్నలిస్టు సంపత్,
ఐలపురం హోటల్ వెంకయ్య, అంబటి మిత్రులు వెంకట్రావు సమాచార శాఖ జేడీ కస్తూరి,
తెలంగాణ యూనియన్ నేత రాంనారాయణ,ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రథాన కార్యదర్శి
చందు జనార్ధన్,యూనియన్ నాయకులు భద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,
ఐజేయూ జాతీయ కార్యదర్శి డి సోమ సుందర్,ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి
సురేష్ , సీపీఎం నాయకులు విశ్వనాథ్, సీనియర్ జర్నలిస్టు మక్కెన సుబ్బారావు,
జర్నలిస్టు యూనియన్ ఫోరం నేత బ్రాహ్మయ్య, విశాలాంధ్ర అసోసియేట్ ఎడిటర్ అజయ్,
నల్లి ధర్మారావు, అంబటి సోదరులు అంబటి సుబ్బారావు, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు
బాబు, మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, సీనియర్ జర్నలిస్టు
పీవీ రావు, లయన్స్ క్లబ్ నేత సాయి వరప్రసాద్, అంబటి మిత్రులు అజాం తదితరులతో
పాటు ఏపీయూడబ్ల్యూజే అర్బన్ నేతలు చావా రవి, కొండా రాజేశ్వరరావు, దారం
వెంకటేశ్వరరావు, జి రామారావు, దాసరి నాగరాజు, సీహెచ్ రమణారెడ్డి, ఎంవీ
సుబ్బారావు, నిమ్మరాజు చలపతిరావు, ఆర్ వసంత్, కే సాంబశివరావు, శివరామకృష్ణ,
రఘు, బీ వీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్రెస్ క్లబ్ లో
ఏర్పాటు చేసిన అంబటి చిత్రపటాన్ని ఐజేయూ అగ్రనేత కే శ్రీనివాసరెడ్డి
ప్రారంభించారు.