విజయవాడ : జర్నలిస్టులు వృత్తి పరంగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నివారణకు
జర్నలిస్టులకు అవగాహన కల్పించేలా ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్
క్లబ్ లో సదస్సు జరగనుంది. డిశంబర్ 8 వ తేది ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ
సదస్సులో “జర్నలిస్టుల మానసిక ఒత్తిడిలు” అనే అంశంపై ప్రముఖ మానసిక వైద్యులు
డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి జర్నలిస్టులకు సలహాలు-సూచనలందిస్తారు. ప్రెస్
అకాడమీ నిర్వహిస్తున్న ఈ సదస్సులో సభాద్యక్షులుగా ప్రెస్ అకాడమీ చైర్మన్
కొమ్మినేని శ్రీనివాసరావు, ముఖ్య అతిధిగా ఏపీ ప్రభుత్వ
సలహాదారులు(కమ్యూనికేషన్స్) జివిడి కృష్ణమోహన్ పాల్గొంటారు. జర్నలిస్టుల
వృత్తి పరమైన మానసిక ఒత్తిడిపై నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రింట్ అండ్
ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ పాల్గొని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్
ఇండ్ల రామసుబ్బా రెడ్డి తో జర్నలిస్టులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని
ఏపీ ప్రెస్ అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ ఓ పత్రికా ప్రకటనలో
తెలిపారు.