విజయవాడ : జర్నలిస్టులు వృత్తి పరంగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నివారణకు
జర్నలిస్టులకు అవగాహన కల్పించేలా ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్
క్లబ్ లో సదస్సు జరగనుంది. డిశంబర్ 8 వ తేది ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ
సదస్సులో “జర్నలిస్టులకు మానసిక ఒత్తిడిలు-పరిష్కార మార్గాలు” అనే అంశంపై
ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి జర్నలిస్టులకు
సలహాలు-సూచనలందిస్తారు. ప్రెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ సదస్సులో
సభాద్యక్షులుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ముఖ్య
అతిధిగా ఏపీ ప్రభుత్వ సలహాదారులు(కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్
పాల్గొంటారు. జర్నలిస్టుల వృత్తి పరమైన మానసిక ఒత్తిడిపై నిర్వహిస్తున్న ఈ
సదస్సులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ పాల్గొని ప్రముఖ
మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డితో జర్నలిస్టులు తమ సందేహాలను
నివృత్తి చేసుకోవచ్చని ఏపీ ప్రెస్ అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్
తిలక్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.