విజయవాడ : జర్నలిస్టుల హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సమాచార
శాఖ కమిషనర్ టి విజయ కుమార్ రెడ్డి కి శుక్రవారం ఎపిడబ్ల్యూజెఎఫ్ ప్రతినిధి
బృందం వినతి పత్రం అందచేసింది. రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకట్రావ్, రాష్ట్ర
నాయకులు వి. శ్రీనివాసరావు, వి సురేష్, బి గోరంట్లప్ప, వలి, అలీమ్, టీవీ రమణ,
విజయవాడ నగర కార్యదర్శి ఎం బి నాథన్ తదితరులు పాల్గొన్నారు.