విశాఖపట్నం: రాష్ట్రంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు తమ
ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి
గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్ ఇంటర్ మీడియా
స్పోర్ట్స్ మీట్ లో భాగంగా సోమవారం పోర్టు మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్
లకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇప్పటికే పూర్తిగా అమలు చేశామన్నారు. అందులో
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి
వీలైనంత త్వరలో ఆ ప్రక్రియ ను పూర్తి చేస్తామన్నారు. విశాఖలో పెండింగ్ లో
ఉన్న 2005 జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఇటీవలే తాను స్వయముగా అధికారుల
తో మాట్లాడి వారి సూచన మేరకు న్యాయ సలహా కోసం సంబంధిత ఫైలును పంపించడం
జరిగింది అని మంత్రి వివరించారు.. అక్కడి నుంచి ఫైల్ క్లియర్ కాగానే తదుపరి
చర్యలు తీసుకుంటారన్నారు. తనకు పదవులతో పనిలేదని జర్నలిస్టులు ఎప్పుడూ తనకు
సోదరులు అన్నారు. నిరంతరం తనను ప్రోత్సహించేది జర్నలిస్టులేనన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి తనకు తగిన ప్రోత్సాహం
ఇచ్చినప్పటికీ , మీడియా వల్ల తాను ఈ స్థాయీకి చేరుకోగలిగానన్నారు.
మంత్రి గుడివాడ సానుకూలం గా స్పందించారు..
కార్యదర్శి దాడి రవికుమార్ మాట్లాడుతూ విజేతలు ఎవరైనప్పటికీ
క్రీడా స్ఫూర్తితో అందరు ముందుకు సాగడం ప్రశంసనీయమన్నారు.22 క్యాటగిరీల్లో
జర్నలిస్టులకు క్రీడలు నిర్వహించడం ఎంతో కష్టమైనప్పటికీ అందరి సహకారంతో పూర్తి
చేయగలిగామన్నారు. అనంతరం మంత్రిని వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ కార్యవర్గం
ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా సింహాద్రినాథుడు జ్ఞాపికను శ్రీనుబాబు బహూ
కరించారు. కార్యక్రమంలో తొలుత ఇరు జట్ల క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకుని
కాసేపు బ్యాటింగ్ చేసి ఉత్సాహపరిచారు. విశాఖ స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్
అధ్యక్షులు ఉమా శంకర్ బాబు, చైర్మన్ జి. నరసింహారావు, కోశాధికారి పి.భాస్కర్
కార్యవర్గ సభ్యులు ఎమ్మెస్సార్ ప్రసాద్, గిరిబాబు వరలక్ష్మి దివాకర్, ఈశ్వర్
రావు మాధవరావు శేఖర్ మంత్రి తదితరులు పాల్గొన్నారు.
పోరాడి ఓడిన ఆంధ్ర ప్రభ జట్టు
సోమవారము నాటి సెమీ ఫైనల్స్ లో ఆంధ్ర ప్రభ జట్టు పోరాడి ఓటమి చెందింది.. తొలుత
బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జ్యోతి జట్టు 16 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి,149
పరుగులు సాధించింది… అనంతరం బ్యాటింగ్ చేసిన ఆంధ్ర ప్రభ జట్టు నిర్ణీత 16
ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.. 21 పరుగుల తేడాతో ఆంధ్ర
జ్యోతి జట్టు విజయం సాధించింది మంగళ వారం వీడియో జర్నలిస్ట్ లు, ఆంధ్ర జ్యోతి
జట్టు ఫైనల్స్ లో తలపడనున్నాయి.