సైదాపురం, వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్ 21:
పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటూ జర్నలిస్ట్ ల పై దాడులు చేయడం దారుణమని జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు చింతలపల్లి రవీంద్ర అన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన చేపట్టారు. రాప్తాడు లో ఆంధ్ర జ్యోతి కెమెరా మెన్ కృష్ణ ను దారుణంగా రౌడీ మూకలు డాడీ చేయడం హేయమైన చర్య అన్నారు. ఈనాడు కార్యాలయం పై దాడి చేయడం పత్రిక స్వేచ్ఛ ను అడ్డుకోవడం సరికాదన్నారు. జర్నలిస్ట్ ల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలన్నారు. అనంతరం డిప్యుటీ తహసీల్దార్ అనురాధకు వినతి పత్రం అందజేశారు.