చత్తీస్ ఘడ్ : జర్నలిస్టుల రక్షణ కోసం చత్తీస్గఢ్ ప్రభుత్వం ‘చత్తీస్గఢ్
మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు-2023 ను తీసుకొచ్చింది. శాసనసభలో ఈ
బిల్లును ఆమోదిస్తూ తీర్మానం చేసింది.. చత్తీస్గఢ్లో 2018 అసెంబ్లీ ఎన్నికలకు
ముందు అక్కడి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రాష్ట్రంలోని జర్నలిస్టులకు రక్షణ
కల్పించే చట్నాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో
అధికారంలోకి వచ్చిన తదుపరి 2019లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అఫ్తాబ్ ఆలం
నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు మీడియా
ప్రతినిధులపై హింసను నిరోధించడం, విధులు నిర్వర్తించడంలో రక్షణ కల్పించే దిశగా
ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఓ వ్యక్తి జర్నలిజంలో కనీసం 10
ఏళ్ల అనుభవం ఉండాలి. ప్రస్తుత సంఘటనపై మీడియా సంస్థలో కనీసం 6 కధనాలను అయినా
ప్రచురించాలి. లేదా కనీసం మూడు నెలల జీతాన్ని సదరు మీడియా సంస్థ నుండి
పొందాల్సి ఉంటుంది.. మీడియా పర్సన్ అంటే ఎడిటర్, రైటర్, న్యూస్ ఎడిటర్,
డిప్యూటీ ఎడిటర్, ఫీచర్ రైటర్, కరస్పాండెంట్, కాపీ ఎడిటర్, కమ్యూనికేటర్,
కార్టూనిస్ట్, న్యూస్ ఫొటోగ్రాఫర్, వీడియో జర్నలిస్ట్, ట్రాన్స్ లేటర్, ట్రైన్
జర్నలిస్టులుగా ఈ బిల్లులో పేర్కొంది. చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల లోపు
చత్తీస్గఢ్ మీడియా ఫ్రీడమ్, ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు
చేయనున్నారు. ఇది మీడియా వర్సన్స్ వ్యక్తిగత నమోదుకు పనిచేస్తుంది. మీడియా
వ్యక్తులపై వేధింపులు, బెదిరింపులు, హింస లేదా తప్పుడు ఆరోపణలు, అరెస్టు వంటి
మీడియా వ్యక్తుల రక్షణకు సంబంధించిన ఫిర్యాదులను కమిటీ పరిష్కరిస్తుంది. ఈ
కమిటీలో ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి రిటైర్డ్ అడ్మినిస్ట్రేటర్, పోలీసు
అధికారి ఉంటారు. హోం డిపార్ట్మెంట్ నామినేట్ చేసిన ప్రాసిక్యూషన్ బ్రాంచ్
అధికారితో పాటు, ముగ్గురు మీడియా వ్యక్తులు, ఇందులో ఒక మహిళ కూడా ఉంటారు. ఒక
ప్రైవేట్ వ్యక్తి హింసకు, వేధింపులకు లేదా మీడియా ప్రతినిధిని భయపెట్టడానికి
కారణమైతే, కమిటీ కేసును పరిశీలించి ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత
నేరస్థుడిపై 25 వేల రూపాయలు జరిమానా విధించవచ్చు. ఏదైనా కంపెనీ మీడియా
ప్రతినిధిని బెదిరింపులు, హింస, అందుకు కారణమైతే ఈ కమిటీ కేసు పరిశీలించి, ఇరు
పక్షాల వాదనలు విన్న తర్వాత 10 వేల రూపాయల జరిమానా విధించబడుతుంది. అర్హులైన
మీడియా ప్రతినిధుల నమోదులో ఎవరైనా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే
కమిటీ దానిపై విచారించి సంబంధిత వ్యక్తికి జరిమానా విధించడమే కాకుండా కఠిన
చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్టం ద్వారా లభిస్తుంది.