నాయుడుపేట : తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆంద్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్
(ఏ.పి.ఎమ్.ఎఫ్ ) ప్రాంతీయ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో నేటి
జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో
ఏ.పి.ఎమ్.ఎఫ్ ప్రధాన కార్యదర్శి పి.ఢిల్లీ బాబు రెడ్డి, ఏ.పి.ఎమ్ఎఫ్ రాష్ట్ర
నాయకులు వల్లూరు ప్రసాద్ కుమార్,, కోలా లక్ష్మీ పతి (తిరుపతి జిల్లా
అధ్యక్షులు), సి.బి. మోహన్ రావు (రాష్ట్ర నాయకులు), టి.వి. మనోహర్ ,చింతల
ఆనంద్ బాబు, జ్యోతి నాయుడు, దార రవి, చంద్ర రాజు, అంతిమ తీర్పు వెంకటేశ్వర్లు,
పలువురు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.