విజయవాడ : సమాజాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు సంక్షేమ
పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నేతలు
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ను కోరారు. గురువారం
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లిబోయిన గోపాల కృష్ణ కు ఈ మేరకు వారు
వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఏ.పి.ఎం.పి.ఏ. నేతలతో మాట్లాడుతూ ఈ
రోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో జర్నలిస్ట్ ల సమస్యలపై కమిటీ సమావేశం
జరిగిందన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ 2023`2024 సంవత్సరానికి సంబంధించి
అక్రిడిటేషన్ల మంజూరు ప్రక్రియ త్వరలో ప్రారంభించే విధంగా,జర్నలిస్ట్ హెల్త్
కార్డ్ సమస్య తక్షణమే పరిష్కరం అయ్యే విధంగా, అలాగే జర్నలిస్టులందరికీ
రూ.10లక్షల ప్రమాద బీమా పథకాన్ని తక్షణమే పరిష్కరించే విధంగా తగు నిర్ణయం
జరిగిందన్నారు. జర్నలిస్ట్ ల మిగతా సమస్యల పరిష్కరము పట్ల ముఖ్యమంత్రి
సానుకూలంగా ఉన్నారన్నారు. అంతేకాక మిగతా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు
చేపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంపీఏ రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల
శ్రీరామ్ యాదవ్, ఉపాధ్యక్షులు మన్నె సోమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి
శాఖమూరి మల్లిఖార్జునరావు,రాష్ట్ర కోశాధికారి మత్తి శ్రీకాంత్,జాయింట్
సెక్రటరీ పసుపులేటి చైతన్య, విజయవాడ నగరాధ్యక్షుడు అనిల్‌కుమార్ తాళ్లూరి
తదితరులు పాల్గొన్నారు.