బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, నయనతార జోడీగా నటిస్తున్న చిత్రం ‘జవాన్’
విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తూన్నారు, దీపికా పదుకొణె స్పెషల్ లుక్ లో
కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ప్రివ్యూ ఈ
సినిమాపై మరింత అంచనాలని పెంచాయి. ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేయడానికి
చిత్రబృందం మరో అడుగు ముందుకేసింది. ‘జవాన్’ సినిమా టైటిల్ సాంగ్ ‘జిందా బందా’
అనే పేరును ఖరారు చేశారు. అంతేకాకుండా ఆ పాట కోసం చెన్నై, బెంగళూరు,
హైదరాబాద్, మధురై, ముంబయి నుంచి వెయ్యికి మందికి పైగా మహిళ డ్యాన్సర్లనీ
సిద్ధం చేశారు. వారితో కలిసి చెన్నైలో షారుక్ ఐదురోజుల పాటు చిందులేశారు. ఈ
పాటకోసం దాదాపు రూ. పదిహేను కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలిపింది చిత్రబృందం.
నృత్య దర్శకుడు శోభి నేతృత్వంలో ఈ పాట రానుంది. అనిరుధ్ సమకూర్చిన స్వరాలు ఈ
పాటకు మరింత ఆకర్షణగా నిలువనున్నాయి. వచ్చే నెల మొదటివారంలో ఈ పాటను విడుదల
చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.