ఈ వేసవికి ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు సాయిధరమ్ తేజ్,
ఇప్పుడు మామ పవన్ కల్యాణ్ కలిసి ‘బ్రో’ సినిమాతో వినోదాలు పంచేందుకు
సిద్ధమవుతున్నారు. మామ అల్లుడు కలిసి నటించిన ఈ చిత్రాన్ని సముద్రఖని
తెరకెక్కించిన సంగతి తెలిసిందే. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. కేతిక శర్మ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 28న
ప్రేక్షుకులముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర రెండో గీతాన్ని శనివారం
తిరుపతిలో విడుదల చేశారు. సాయితేజ్, కేతికలపై చిత్రీకరించిన రొమాంటిక్ పాటిది.
“జాణవులే.. నెర జాణవులే.. నా జాను నువ్వులే” అంటూ సాగుతున్న ఈ గీతానికి తమన్
స్వరాలు సమకూర్చడమే కాకుండా ప్రణతితో కలిసి స్వయంగా ఆలపించారు. కాసర్ల శ్యామ్
సాహిత్యమందించారు. ఈ సినిమాలో మార్కండేయులు పాత్రలో తేజు కనిపించనుండగా
కాలస్వరూపుడిగా పవన్ కల్యాణ్ దర్శనమివ్వనున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్,
తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి
స్క్రీన్ ప్లే, మాటలు: త్రివి క్రమ్, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: సుజిత్
వాసుదేవ్.