సదస్సుకు హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా
అమరావతి : జాతీయ భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై బెంగుళూరు వేదికగా
ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా
హాజరయ్యారు. ఏపీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సులో సీఎం
వైయస్.జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ
సదస్సుకు హాజరుకాలేకపోయానని సీఎం వైయస్.జగన్ తెలిపారు. అసెంబ్లీలో
ద్రవ్యవినిమయబిల్లును ఆమోదించాల్సిన నేపధ్యంలో ఈ సమావేశానికి
హాజరుకాలేకపోయానని, అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నానని
పేర్కొన్నారు. మా ప్రభుత్వం తరపున డీజీపీ ఈ సదస్సుకు హాజరయ్యారని, సదస్సులో
తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని సీఎం
వైయస్.జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.