మాజీ ఉప ముఖ్యమంత్రి, శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : జాతీయ స్థాయిలో జిల్లా కీర్తి ప్రతిష్టితను ఇనుమడింపజేయాలని
రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్ యువతకు
పిలుపునిచ్చారు. గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీలో బుధవారం నిర్వహించిన జిల్లా
స్థాయి యువజనోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ యువజనోత్సవాల్లో విద్యార్థులు తమ ప్రతిభ పాటవాలను కనపరచుకోవచ్చని
చెప్పారు. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పివి సింధు మంచి పేరు
తెచ్చుకున్నట్లు వివరించారు.
విద్యార్థులు జాతీయ స్థాయిలో జిల్లా కీర్తి ప్రతిష్టతను ఇనుమడింపజేయాలన్నారు.
విద్యార్థులు క్రమ శిక్షణతో మందుకు సాగాలని హితవుపలికారు. పట్టుదలతో ఏ
కార్యక్రమైనా సాదించవచ్చునని ఉద్బోదించారు. యువజనోత్సవాలలో సాంస్కృతిక పోటీలు
15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల వయసు గల యువతీ యువకులకు 32 అంశాలపై వివిధ
రంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని జిల్లా యువత
సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ
శ్రీకాకుళం జిల్లాకు కళలకు, క్రీడలకు ఎంతో ప్రాచుర్యం ఉందన్నారు.
విద్యార్థులు అందరూ యువజనోత్సవాల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయి ఎంపికలో
పాల్గొనడాకి చక్కని అవకాశమని తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తుందని
చెప్పారు. చదువుతో పాటు కళారంగాల్లో పాల్గొని ఉత్తేజితులవ్వాలన్నారు.
శ్రీకాకుళం ఎంపిపి అంబటి నిర్మల మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కళా
రంగాల్లో ముందుండాలన్నారు. సెట్ శ్రీ సిఇఓ ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతిభ గల
వివిధ రంగాల్లో కళాకారులను ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీలకు పంపుతామన్నారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు
స్వామి వివేకానంద చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రంగాల్లో పోటీలు నిర్వహించి
విజేతలను ఎంపిక చేశారు. ఈ సమావేశంలో మెప్మా పిడి కిరణ్ కుమార్,యూత్ కో
ఆర్డినేటర్ ఉజ్వల్, సెట్ శ్రీ మేనేజర్ వి వి అప్పలనాయుడు, గురజాడ ఎడ్యుకేషనల్
సొసైటీ ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు, ఇంటాక్ అధ్యక్షులు రాధాకృష్ణ, ఎన్.జిఓ
పి. కృష్ణారావు, అకౌంటెంట్ కెవి రమణ, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు
పాల్గొన్నారు.