గత నాలుగేళ్లలో 35 వేల మంది నిరుద్యోగుల ఆత్మహత్య
జాబు రావాలంటే జగన్ దిగిపోవాలి : తెలుగు యువత
విజయవాడ : జాబ్ కేలండర్ కోసం తెలుగు యువత ఆద్వర్యంలో పోరాటాన్ని
కొనసాగిస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉరితాళ్లు మెడకు వేసుకుని వినూత్న
రీతిలో నిరసన తెలిపారు. ఏటా జాబ్ కేలండర్ అని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన
జగన్ నిరుద్యోగుల పాలిట శాపంగా మారాడని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాలుగేళ్ల
పాలనలో ఒక్క జాబ్ కేలండర్ కూడా ఇవ్వలేదని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 వేలమంది నిరుద్యోగులు
ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల 30 వేల ప్రభుత్వ
ఉద్యోగాలు ఇస్తామని యువతను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ప్రతియేటా జనవరి
జాబ్ కేలండర్ ఇస్తామని నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్క జాబ్ కేలండర్ లేకుండా
చేయడమే కాకుండా కొన్ని జాబ్ లను కూడా పీకేసారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో
నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే సైకో పోవాలి అని,జాబు రావాలంటే బాబు రావాలి
అని నినాదాలు చేశారు. అపార అనుభవం కలిగిన చంద్రబాబునాయుడు మరలా ముఖ్యమంత్రి
అయితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.యువత అంతా కలసి కట్టుగా
కృషి చేసే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించి ఉద్యోగాల కల్పతరువు అయిన తెలుగుదేశం
పార్టీని గెలిపించేందుకు యువత అంతా కలసి రావాలని కోరారు.