వస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే జిడ్డు చర్మం వారు వీటిని ఉపయోగించడం
వల్ల ప్రయోజనం ఉంటుంది.
ప్రైమర్:
జిడ్డు చర్మం కలిగిన వారిలో మేకప్ ఎక్కువ సేపు నిలవదు. జిడ్డు కారణంగా మేకప్
త్వరగా తొలగిపోతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ప్రైమర్ ను ఉపయోగించడం
అవసరం.
క్లెన్సర్:
జిడ్డు చర్మం ఉన్నవారు తేలికపాటి, నూనెలేని క్లెన్సర్ ను మాత్రమే
వినియోగించాలి. చాలా మంది అదనపు నూనెను తొలగించడానికి కఠినమైన క్లెన్సర్ ను
ఉపయోగించడంతో చర్మం నిగారిస్తుంది.
ఫేసియల్ మాస్క్:
జిడ్డు చర్మం కలిగినవారి కోసం మార్కెట్లో ప్రత్యేకమైన ఫేసియల్ మాస్క్ లు
ఉంటాయి. వీటిని ఉపయోగించడంతో నూనె ఉత్పత్తి తగ్గుతుంది. సహజ ఉత్పత్తులతో తయారు
చేసిన మాస్క్ లు ఉపయోగించడం ఉత్తమం.
స్క్రబ్:
జిడ్డు చర్మంతో బాధపడుతున్న వారు మృతకణాలు, బ్లాక్ హెడ్స్ తో ఇబ్బంది పడతారు.
వీటి నుంచి ఉపశమనం పొందేందుకు స్క్రబ్ చేసుకోవాలి. ఎక్స్ఫోలియేట్ చేయడంతో
చర్మం మెరుస్తుంది.
స్టీమర్:
ముఖానికి ఆవిరిపట్టడంతో చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో చర్మంపై
పేరుకుపోయిన దుమ్ము, ధూళి సులభంగా బయిటకుపోతుంది. జిడ్డు చర్మం కలిగిన వారిలో
దుమ్ము పేరుకుపోవడం అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది.
ఆయిల్ ఫ్రీ కాంపాక్ట్:
ఆయిల్ ఫ్రీ కాంపాక్ట్ లు ఉపయోగించడంతో చర్మంపై జిడ్డు సులభంగా తొలగుతుంది. ఈ
ఫార్ములా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. వీటిని వినియోగించడంతో రంధ్రాలు
మూసుకుపోవు.
మినరల్ పౌండేషన్:
జిడ్డు చర్మం ఉన్న వారు మేకప్ వేసుకునే ముందు సరైన పౌండేషన్ ను సెలక్ట్
చేసుకోవడం అవసరం. ఇందుకోసం మినరల్ ఫార్ములేషన్ ఉన్న పౌండేషన్ను ఉపయోగించడం
అవసరం.