అభినందించిన ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం : జిల్లా వక్స్ కమిటీ నూతన అధ్యక్షునిగా మహమ్మద్ అబ్దుల్
సిరాజుద్దీన్ (సిజ్జు) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పక్స్ బోర్డు ముఖ్య
కార్యనిర్వాహణాధికారి జవాబ్ అబ్దుల్ ఖాదిర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నూతన
కమిటీలో ఉపాధ్యక్షునిగా షేక్ బాబ్జి, కార్యదర్శిగా షేక్ అలీ జాన్, కార్యవర్గ
సభ్యులుగా మహ్మద్ సలీమ్ ఖాన్, ఎంఎ షఫీ, ఏకేఎస్ సాధిక్ అహ్మద్, షేక్ అజీజ్,
షేక్ అబ్దుల్ రెహమాన్, సర్ఫాస్ట్ ఆలమ్, షేక్ సుదీనా, మీక్ ఖాసిమ్ హుస్సేన్ లు
ఉన్నారు. ఈ కమిటీ రాష్ట్ర పక్స్ బోర్డు ఆదేశాల మేరకు తమ కార్యకలాపాలను
నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జిల్లా వక్స్ కమిటీ నూతన అధ్యక్షునిగా నియమితుడైన
మహమ్మద్ అబ్దుల్ సిరాజుద్దీన్ని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అభినందించారు. జెడ్పీ చైర్పర్సన్ ఏరియా విజయ,
కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్
అంధవరపు సూరిబాబు, జిల్లా వర్సింగ్ ప్రెసిడెంట్ శిమ్మ రాజశేఖర్, గొండు రఘురాం,
వైఎస్ఆర్సీ నాయకులు చింతాడ మంజు, సురంగి మోహనరావు, పొన్నాడ ఋషీశ్వర రావు,
సుంకరి కృష్ణ, ఎంఎ బేగ్, సిరాజుద్ధున్, ఎన్ని ధనుంజయ, కామేశ్వరి, గంగు శారద,
జీవరత్నం, గుంట జ్యోతి, నల్లజారికి శ్రీనివాసరావు తదితరులు సిజ్జు ను
అభినందించిన వారిలో ఉన్నారు.