విజయవాడ : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.యస్
జవహర్ రెడ్డి ని విజయవాడ లోని వారి క్యాంప్ కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్
రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపిజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు కలసి వారికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ చేతుల మీదుగా
ఏపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన డిసెంబర్-2022 మాసం వరకు ప్రభుత్వం
విడుదల చేసిన రెవెన్యూ చట్టాలు అన్నీ, 26- జిల్లాల కలెక్టర్లు, జాయింట్
కలెక్టర్, రెవెన్యూ అధికారుల సమాచారాన్ని క్రోడీకరించి ప్రతి సంవత్సరం
ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రెవెన్యూ డైరీ-2023″, రెవెన్యూ క్యాలండర్లను
సియస్ చే అవిష్కరింప చేశారు. అలాగే ఏపి జేఏసీ అమరావతి రూపొందించిన ఏపి జేఏసీ
అమరావతి క్యాలండర్ – 2023″ ను కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతుల
మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి దృష్టికి ఉద్యోగులకు సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలు
తీసుకువచ్చారు. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం 1 నుండి రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగులు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలు చేయాలని 27/12/2022 న
ప్రభుత్వం ఇచ్చిన జీఓ 159 పై ఉద్యోగ సంఘాలతో వెంటనే చర్చించాలని , ప్రధానంగా
దివైజస్/సిగ్నల్స్ అందుబాటు, అన్ని శాఖలలో పనిచేస్తున్న ఫీల్డ్ స్టాఫ్ కు
కొన్ని అవసరమైన మినహాయింపులు తదితర అంశాలపై సానుకూల దృక్పథంతో నిర్ణయం
తీసుకోవాల్సి ఉందని కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ
సర్వీసెస్ అసోసియేషన్, ఏ పి జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు నాయకులందరికీ నూతన
సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రెవెన్యూ డైరీ రాష్ట్రంలోని అందరూ
రెవెన్యూ ఉద్యోగులు, అధికారులకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
రెవెన్యూ డైరీ, క్యాలండర్ ఆవిష్కరణలో వి. గిరి కుమార్ రెడ్డి, యన్.
శ్రీనివాస్, ఆర్ వి రాజేష్, యం.మాధురి, జి.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఈ.ఫణి
కుమార్, ఏ పీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. అంజనేయ
కుమార్ (చంటి), కార్యదర్శి శ్రీ సాంబశివ రావు, వి అర్ ఏ రాష్ట్ర అధ్యక్షులు జి
జయరాజు, వెంకట్రావు, పాల్గొన్నారు. అలాగే ఏ పి జేఏసీ అమరావతి పక్షాన రాష్ట్ర
సహా చైర్మన్ టి వి ఫణి పేర్రాజు, కోశాధికారి వివి మురళీృష్ణ నాయుడు, కో
చైర్మన్ కె మల్లీశ్వర రావు, బి.కిషోర్ కుమార్, వైస్ చైర్మన్ కె పి చంద్రశేఖర్,
మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి ఈశ్వర్,
గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వి.
అర్లయ్య, కోశాధికారి బగ్గా జగదీష్, వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి జి జ్యోతి
కాంట్రాక్ట్ ఔట్సౌర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కే.సుమన్, భావనా ఋషి
తదితరులు పాల్గొన్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వై.వీ రావు, చేబ్రోలు
కృష్ణమూర్తి తెలిపారు.