గింజ నుంచి మండలాల్లో సాగు చేస్తారు. బ్రెజిల్ ను దీనికి పుట్టినిల్లుగా
చెప్పవచ్చు. ఇక మన దేశం నుంచి కూడా జీడి ఎగుమతి భారీ స్థాయిలో జరుగుతోంది.
సాధారణంగా జీడిపండ్లు వేసవిలో బాగా సాగవుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని వజ్రపుకొత్తూరు, ” మందస, పలాస, సోంపేట,
కంచిలి, కవిటి తదితర మండలాల్లో 74 గ్రామాల్లో సుమారు లక్ష ఎకరాల్లో జీడిపంట
సాగవుతోంది.
*జీడిపప్పులో ఉండే పోషకాలు:
*జీడిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ.
*విటమిన్ ఇ, కె, బి6 పుష్కలం.
* క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండు.
*ఆరోగ్య ప్రయోజనాలు:
1) జీడిపప్పు తినడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటును
నియంత్రణలో ఉంటుంది.
2) జీడిపప్పులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. ఇవి రోగనిరోధక శక్తిని
పెంచేందుకు తోడ్పడతాయి.
3) కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి
కూడా దీనిని డైట్ లో చేర్చుకుంటే ఫలితం కనిపిస్తుంది.
4) దీనిలో అన్ శాటురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. హృద్రోగా ముప్పును నివారిస్తాయి.
5) ఉడికించిన మాంసంలో ఉండే ప్రొటిన్ కు సమానంగా
జీడిపప్పులోనూ ప్రొటిన్ ఉంటుంది.
6) ఇందులోని కాపర్ బుద్ధి కుశలతను పెంపొందించడానికి
ఉపయోగపడుతుంది.
7) మెగ్నీషియం,మాంగనీస్ కండరాల ఆరోగ్యాన్ని
మెరుగుపరుస్తాయి.