జీవో నెం.1పై పూర్తయిన వాదనలు
తీర్పును రిజర్వ్ లో ఉంచిన హైకోర్టు
ఇటీవల జీవో నెం.1ను తెచ్చిన ఏపీ ప్రభుత్వం
హైకోర్టులో పిటిషన్ దాఖలు
జీవోను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసిన కోర్టు
సుప్రీంను ఆశ్రయించిన ఏపీ సర్కారు
హైకోర్టే విచారిస్తుందన్న సుప్రీం
హైకోర్టులో విచారణ షురూ
వెలగపూడి : జీవో నెంబరు 1పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును
న్యాయస్థానం రిజర్వు చేసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదనలు
కొనసాగాయి. సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ
జరిపిన న్యాయస్థానం నిన్నటి వరకు జీవో నెంబరు 1ని సస్పెండ్ చేసిన విషయం
తెలిసిందే. జీవో నెంబరు 1పై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నుంచి కూడా పిటిషన్లు
దాఖలయ్యాయి. దీంతో ముగ్గురు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం జీవో నెంబరు 1 తెచ్చిందని
న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు.
ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఇటీవల ఏపీ
ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద జీవోపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి.
హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. వాదనల సందర్భంగా జీవో
నెం.1పై సస్పెన్షన్ కొనసాగించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
అందుకు, హైకోర్టు ధర్మాసనం నిరాకరించినట్టు తెలుస్తోంది. రోడ్లపై సభలు,
సమావేశాలు, రోడ్ షోల అనుమతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల జీవో నెం.1
తీసుకువచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ
పిటిషన్ ను విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ నెల 23 వరకు జీవోను సస్పెండ్
చేసింది. దీన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా, ఈ జీవో విషయంలో తాము
జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిపై
హైకోర్టు విచారణ జరుపుతుందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో, సస్పెన్షన్ గడువు
నిన్నటితో ముగియడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ షురూ
చేసింది. వెకేషన్ బెంచ్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణను నేటికి
వాయిదా వేసింది.