విజయవాడ : జీవో నెంబర్1 ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేసుకోవాలని జనసేన
అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. ఈ జీవో ప్రజాస్వామ్యం పై
కత్తి పెట్టడమేనని పేర్కొన్నారు. సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు ఈ జీఓ
నిలువెత్తు నిదర్శనమని అన్నారు. సీఎం జగన్ ది బ్రిటిష్ డిఎన్ఏ అని, అందుకనే
దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన తదుపరి కూడా ఆ పాలకుల జీవోలను నేడు
అమలు చేస్తున్నారని, జగన్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నందున
ప్రతిపక్షలా గొంతు నొక్కేందుకే ఈ జీవో జారీ చేశారని, ఇటువంటి
దుర్మార్గమైనటువంటి జీవోను రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని,
ఈ జీవోను రద్దు చేసేంతవరకు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు
ప్రజలు కలిసి ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పౌర హక్కుల సంఘం వారు
నిర్వహించిన సదస్సుకు జనసేన పార్టీ తరపున రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ
నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్, సిపిఐ
రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు తో
కలసి మద్దతు తెలిపారు. జీవో నెంబర్ వన్ రద్దు చేయాలని పోతిన వెంకట మహేష్
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.