విజయవాడ : పేదల మనిషి , బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత వంగవీటి మోహన
రంగా 76వ జయంతి సందర్భంగా జులై 4వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రంగా
జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు ఆకుల
శ్రీనివాస్ కుమార్ తెలిపారు. రంగా స్ఫూర్తితో ఎంతోమంది రాజకీయాల్లో ఉన్నతమైన
పదవుల్లో రాణిస్తున్నారని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన
విలేకరుల సమావేశంలో ఆకుల శ్రీనివాస్ కుమార్ ఎం, కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ
ప్రజా నాయకుడు వంగవీటి మోహన్ రంగా జీవితాన్ని నేటి తరం వారికి తెలియజేయాలని
ఉద్దేశంతోనే జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజకీయ
పార్టీలకు అతీతంగా వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు నగరంలోని అన్ని డివిజన్లలో
ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అసమాన్యుడైన
వంగవీటి మోహన్ రంగా అనే శక్తిని తెలుగుదేశం పార్టీకి చెందిన దుర్మార్గులు
కిరాతకంగా హత్య చెయ్యడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు. జయంతి సందర్భంగా ఉచిత
మెడికల్ క్యాంపు , రక్తదాన శిబిరం, వివిధ సేవా కార్యక్రమాలు తుమ్మలపల్లి
కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నమని పేర్కొన్నారు. రంగా స్ఫూర్తి యునైటెడ్
ఇండిపెండెన్స్ విద్యార్థి సంఘం నాయకుడిగా కొనసాగడం జరిగిందని తెలిపారు.
కులాలు మతాలకు , రాజకీయాలకు అతీతంగా రంగాస్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో
నడుచుకుంటున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రంగా విగ్రహాలు ఏర్పాటు చేసి
దేవుడిగా పూజిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు
కొప్పులు వెంకట్ , రాజీనాల బాబ్జి, బాడిత శంకర్ , మాజీ కార్పొరేటర్
శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ గ్రిటన్, మైనారిటీ నాయకులు సలీమ్ పర్వేజ్,
పొదిలి చంటి బాబు , అల్లం పూర్ణ , మేళం చిన్న , రాధా రంగా మిత్ర మండలి నాయకులు
దూపాటి నరసింహారావు, ఏలూరి వెంకన్న , అల్లుడు సాంబశివరావు , మహిళ నాయకురాలు వి
సామ్రాజ్యం, పూల ధనలక్ష్మి ,లేయర్ దుర్గా ప్రసాద్ తో పాటు పలువురు కాపు సంఘం
నాయకులు పాల్గొన్నారు.