విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర
ఎన్నికలు జులై 9న ఆదివారం ఉదయం 10 గంటలకు గాంధీ నగర్ లో ఉన్న ఫిలిం చాంబర్ లో
జరుగుతాయని రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు వెల్లడించారు. ఈ
ఎన్నికలకు ఎన్నికల అధికారిగా ఆర్, చిరంజీవిరావు, ఏపీ సర్వే సంఘం రాష్ట్ర
అధ్యక్షులు ఆసిస్టెంట్ ఎన్నికల అధికారిగా బి సుగుణ, ఏపీజీఏ రాష్ట్ర
ఉపాధ్యకురాలు, ఎలక్షన్ అబ్జర్వర్ గా జి. నాగ సాయి, అసిస్టెంట్ రిజిస్టర్
కోపరేషన్ డిపార్ట్మెంట్ వారు వ్యవహరిస్తారన్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య
పెద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులు మండల స్థాయి నుండి,
డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి ఎన్నికలు పూర్తిచేసుకుని 9న రాష్ట్ర ఎన్నికలు
జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర గ్రామ రెవెన్యూ
అధికారుల సంఘం సమావేశం జరుగుతుందని, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్ర
ప్రదేశ్ గవర్న మెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జి ఆస్కార్ రావు,
ఏపీ ఎన్జీవోస్ పశ్చిమ కృష్ణ, అధ్యక్షులు వి. విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ జేఏసీ
చైర్మన్ వాసా దివాకర్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర
అధ్యక్షులు లాం విద్యాసాగర్ హాజరవుతారని తెలిపారు. కావున రాష్ట్ర వ్యాప్తంగా
ఉన్న అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, డివిజన్
అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ లో ఉత్సాహంగా రాష్ట్ర సంఘంలో పని
చేయడానికి ఆసక్తి ఉన్న వారందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని రాష్ట్ర విఆర్వోల
సంఘం బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు,
రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎం. అప్పలనాయుడు కోరారు.