వెలగపూడి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డా.వైఎస్సార్ లా నేస్తం,
న్యాయవాదుల సంక్షేమ నిధి పథకాలు రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు,
న్యాయవాదులకు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయని ప్రభుత్వ లీగల్, లెజిస్లేటివ్
ఎఫైర్స్ మరియు న్యాయ సెక్రటరీ జి.సత్యప్రభాకర రావు పేర్కొన్నారు. ప్రపంచాన్ని
అతలాకుతలం చేసిన కోవిడ్ విత్తుల్లో కూడా ఈ రెండు పథకాలు రాష్ట్రంలోని జూనియర్
న్యాయవాదులను, న్యాయవాదులను ఎంతగానో ఆదుకున్నాయని ఆయన అన్నారు.
జూనియర్ న్యాయవాదులకు వరంగా మారిన డా.వైఎస్సార్ లా నేస్తం
నూతనంగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన జూనియర్ న్యాయవాదులకు రాష్ట్ర
ప్రభుత్వం అమలు చేస్తున్న డా.వైఎస్సార్ లా నేస్తం పథకం ఒక వరంగా మారిందని
ప్రభుత్వ లీగల్, లెజిస్లేటివ్ ఎఫైర్స్, న్యాయ సెక్రటరీ జి.సత్యప్రభాకర రావు
అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో న్యాయవాద వృత్తిలో నూతనంగా ప్రవేశించిన
వారు ఆ వృత్తిలో నిలద్రొక్కుకోవడం చాలా కష్టమని, అయితే డా.వైఎస్సార్ లా సేన్తం
ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న నెలవారీ రూ.5000ల స్టైఫండ్ వారిని ఎంతగానో
ఆదుకోవడమే కాకుండా ఆ వృత్తిలో వారు నిలద్రొక్కుకునేలా చేయూతను అందిస్తున్నదని
ఆయన పేర్కొన్నారు. 2019 లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు
చేపట్టిన వెంటనే నవరత్నాల పథకాలు అమల్లో భాగంగా డా.వైఎస్సార్ లా సేన్తం పథకం
అమలుకు శ్రీకారం చుడుతూ 2019 అక్టోబరు 26 న జి.ఓ.ఎంఎస్.నెం.75 ను జారీ చేయడం
జరిగిందన్నారు. ఈ జి.ఓ.లో నిర్థేశించిన నియమ నిబంధల మేరకు నూతనంగా న్యాయవాద
వృత్తిలోకి ప్రవేశించిన జూనియర్ న్యాయవాదులకు మూడు సంవత్సరాల పాటు (35
సంవత్సరాల లోపు వారికి) నెలకు రూ.5000ల చొప్పున స్టైఫండ్ మంజూరు చేయడం
జరుగుచున్నదన్నారు. ఈ పథకం అమల్లో ఎంతో పారదర్శకంగా వ్యవహరించడం
జరుగుచున్నదని, ఇ-ప్రగతి నోడల్ ఏజన్సీ ద్వారా గుర్తించిన అర్హులైన జూనియర్
న్యాయవాదులకు మాత్రమే ఈ స్టైఫండ్ ను మంజూరు చేయడం జరుగుచున్నదన్నారు.
2019-20, 2020-21 లో సంభవించిన కోవిడ్ విపత్తుల్లో వర్చ్యువల్ గా కోర్టుల్లో
హియరింగ్ జరగడం వల్ల జూనియర్ న్యాయవ్యాదులు ఎన్నో సమస్యలను
ఎదుర్కొన్నారన్నారు. అయితే అటు వంటి విప్తతులో కూడా ప్రభుత్వం అమలు
చేస్తున్న డా.వైఎస్సార్ లా సేస్తం పథకం రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులను
ఎంతగానో ఆదుకుందన్నారు.
న్యాయవాదులకు చేయూతనిస్తున్న న్యాయవాదుల సంక్షేమ నిధి
నవరత్నాలు పథకాల అమల్లో భాగంగా న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.100 కోట్ల
కార్పస్ నిధితో న్యాయవాదుల సంక్షేమ నిధిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం
జరిగిందన్నారు. అడ్వొకేట్ జనరల్ చైర్మన్ గా, ఆర్థిక శాఖ ప్రిన్సఫల్ సెక్రటరీ
ట్రస్టీగా, లా సెక్రటరీ మేనేజింగ్ ట్రస్టీగా మరియు ఏ.పి.బార్ కౌన్సిల్ నుండి
నలుగురు సభ్యులుగా ఒక ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.