చిత్తూరు : జూలై 4 న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన
లోభాగంగా హెలి ప్యాడ్, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఉప ముఖ్య మంత్రి
ఎక్సైజ్ శాఖ మంత్రి కె. నారాయణ స్వామి, అటవీ, ఇందన, విద్యుత్, శాస్త్ర
సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాజo పేట
పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్ రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటనల
రాష్ట్ర సలహాదారులు తలశీల రఘురాం, జడ్పీ చైర్మన్ గోవిందప్పశ్రీనివాసులు,
జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, జిల్లా ఎస్.పి రిశాంత్ రెడ్డి, చిత్తూరు,
పూతలపట్టు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఎం.ఎస్ బాబు, ఎం ఎల్ సి భరత్ లతో
కలసి హెలిప్యాడ్, బహిరంగ సభ నిర్వహణ కు స్థలాల పరిశీలన చేశారు. ఇందులో భాగంగా
నందు హెలిప్యాడ్ ఏర్పాటు నిమిత్తo మెసానికల్ గ్రౌండ్, బహిరంగ సభ నిమిత్తం
పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లను పరిశీలించి విజయా డెయిరీని పరిశీలించారు. ఈ
కార్యక్రమంలో జెసి పి.శ్రీనివాసులు, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్
బుల్లెట్ సురేష్, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, చిత్తూరు నగర మేయర్ అముద,
జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఆర్ డి ఓ
రేణుకా, అడిషనల్ ఎస్పీ సుధాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.