‘ఆదిపురుష్ ‘లో రాముడిగా మెప్పించారు ప్రభాస్. ఈ చిత్రంపై ఎన్ని విమర్శలు,
ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా దూసుకుపోతోంది. తొలి
మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు సాధించింది. ‘ఆదిపురుష్’ తరవాత ‘సలార్ పైన
దృష్టి పెట్టారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో
శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఫృథీరాజ్ ప్రతినాయకుడి పాత్రలో
నటిస్తున్నారు. జులై 7న టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు
తెలుస్తోంది. నిజానికి ‘ఆదిపురుష్’ విడుదల రోజునే థియేటర్లోలో ‘సలార్’ టీజర్‌ని
ప్రదర్శిస్తారని చెప్పుకొన్నారు. కానీ అది సాధ్యపడలేదు. సెప్టెంబరు 28న ఈ
చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ‘కేజీఎఫ్’లానే ఈ చిత్రాన్నీ
రెండు భాగాలుగా విడుదల చేస్తారని ప్రచారం కూడా జరుగతోంది. దీనిపై టీజర్ లోనే ఓ
స్పష్టత రానుంది. ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ కూడా ‘సలార్ లో ఓ అతిథి పాత్రలో మెరిసే
అవకాశాలున్నట్లు తెలుస్తోంది.