లక్షలాది అభిమానుల నివాళి
హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ తండ్రి జాన్ అనిస్టన్ (89) కన్నుమూశారు. ఈ
విషయాన్ని ఆమె కుమార్తె జెన్నిఫర్ అనిస్టన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో
వెల్లడించింది. నవంబర్ 14న ఇన్‌స్టాగ్రామ్‌లో “నాకు తెలిసిన అత్యంత అందమైన
వ్యక్తులలో మీరు ఒకరు” అనే క్యాప్షన్‌తో తన తండ్రితో ఉన్న చిత్రాల క్రమాన్ని
జెన్నిఫర్ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని
పంచుకుంది. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌లో జెన్నీఫర్ పోస్ట్ వెల్లడైన
వెంటనే లక్షలాది మంది అభిమానులు స్పందించారు. తండ్రిని కోల్పోయిన
జెన్నిఫర్‌కు ఓదార్పు అందించారు. జాన్ అనిస్టన్ మృతికి నివాళులర్పించారు.
ప్రముఖ మోడల్ హెలెనా క్రిస్టెన్సన్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.