కర్నూలు : జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా
చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జైరాజ్
కంపెనీ వారిని అదేశించారు. గురువారం ఓర్వకల్ మండలము, గుట్టపాడు గ్రామంలో
నిర్మిస్తున్న జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ పనుల పురోగతి అంశం పై ఆర్థిక శాఖ
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, ఇండస్ట్రీస్
కమీషనర్ ప్రవీణ్ కుమార్ సంబంధిత యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్
పనులకు సంబంధించిన పురోగతి నెమ్మదిగా ఉందని పురోగతి వేగవంతం చేసి త్వరితగతిన
జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే
చెప్పాలని సంబంధిత యాజమాన్యం వారిని అడగగా వారు స్పందిస్తూ ట్రాన్స్పోర్ట్ కి
సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ వేయించాలని, ఐలా పర్మిషన్ ఇప్పించాలని, నీటి
సమస్యను పరిష్కరించాలని, స్ట్రీట్ లైటింగ్ వేయించాలని ఆర్థిక శాఖ మంత్రి
దృష్టికి తీసుకొని రాగా వారు చెప్పిన సమస్యలకు సంబంధించిన శాఖల వారు సమన్వయం
చేసుకొని సమస్యలన్నిటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా పనులు పూర్తి చేసేందుకు ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని వాటి
ప్రకారం నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని
అన్నారు. ముందుగా వారు చేస్తున్న పనులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, ఇండస్ట్రీస్ కమీషనర్
ప్రవీణ్ కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి పవర్ పాయింట్
ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని
రాంభూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎపిఎమ్ఐసి
జోనల్ మేనేజర్ విశ్వేశ్వర రావు, ఇండస్ట్రీస్ మేనేజర్ రమణ రెడ్డి, జైరాజ్
స్టీల్ ప్లాంట్ కంపెనీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.