విజయవాడ : తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని కోడికత్తి కేసు నిందితుడు
శ్రీనివాసరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 1,610 రోజులుగా
బెయిల్ రాకుండా తాను జైలులోనే ఉంటున్నట్టు లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా
ఎంతకాలం జైల్లో ఉండాలో తెలియడం లేదని, విముక్తి కలిగించాలని సీజేఐని కోరాడు.
పలుసార్లు కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశానని, కొట్టేశారని
తెలిపాడు. విచారణ త్వరగా ముగించేలా చర్యలు చేపట్టాలని, తన తల్లి సావిత్రి
గతంలో సీజేఐకి ఇదే విషయంపై లేఖ రాశారని పేర్కొన్నాడు. కోడికత్తి కేసుపై
గురువారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. వాదనలు వినిపించేందుకు
గడువు కావాలని సీఎం జగన్ తరఫు న్యాయవాది న్యాయమూర్తిని కోరారు. దీంతో తదుపరి
విచారణను జులై 4కి వాయిదా వేశారు. అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించి
స్టేట్మెంట్ తీసుకోవాలని, కేసును మరింత లోతుగా విచారణ చేయాలని కోరుతూ సీఎం
జగన్ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో పిటిషన్లపై వాదనలు
వినిపించారు. అయితే న్యాయమూర్తి బదిలీపై వెళ్లి.. నూతన న్యాయమూర్తి రావటంతో
మరోసారి పూర్తి స్థాయి వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది.