ఈరోజు స్థానిక వెంకటగిరి టౌన్ జనసేన కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఆదేశిస్తే వారికే టికెట్ ఇది మా అధ్యక్షులు వారు నిర్ణయం ప్రకారం మేము అందరం నడుచుకుంటాం అంతేకానీ ఎవరెవరో మాకు టికెట్ కావాలా మీకు టికెట్ కావాలా అనే పద్ధతికి మేము వ్యతిరేకం ఈ సమావేశమందు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించుచున్నాము.హాజరైన అందరూ వారి వారి అభిప్రాయాల్ని తెలియజేసి జనసేన తెలుగుదేశం టికెట్టు ఎవరికి ఇచ్చిన వారిని అఖండ మెజార్టీతో గెలిపించగలమని ఈ సమావేశ తీర్మానించడం అయినది. ఈ సమావేశానికి అనిల్ రామారావు తోట కృష్ణయ్య చామండి రాధమ్మ అరవ రాజేష్ కందాల తిరుపాలు రిజ్వాన్ భాషా ముని చంద్ర మరియు కలపాటి దుర్గాప్రసాద్ వెంకటేశ్వరరావు మొదలగువారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి అందరికీ అభినందనలు