కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో 100
రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర కార్యాలయం విజయ వాడలోని ఆంధ్ర
రత్న భవన్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు ఆధ్వర్యంలో
కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి హర్షం వ్యక్తం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభమై తమిళనాడు, కేరళ,
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా
అన్ని వర్గాల ప్రజలనూ కలుసుకుంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ.. ప్రస్తుతం
రాజస్థాన్ రాష్ట్రం లో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోందని గిడుగు అన్నారు.
ప్రస్తుతం దేశానికి పట్టుకున్న కారుమబ్బులు, చీకట్లు తొలగిపోయి 2024 లో రాహుల్
గాంధీ అనే వెలుగు తో దేశ ప్రజలందరి జీవితాల్లో వెలుగు వస్తుందని జోస్యం
చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ యాత్ర పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఈ యాత్ర
దిగ్విజయంగా చివరి వరకు కొనసాగాలని ఆకాంక్షిస్తూ యాత్రను ఆదరిస్తున్న ప్రతి
ఒక్కరికీ దన్యవధాలు తెలియజేశారు.