అమరావతి : మహాత్మా జ్యోతీరావ్ పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి తన
నివాసంలో పూలు వేసి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాళులు
అర్పించారు.అణగారినవర్గాల ఆశాజ్యోతి పూలే
నివాసంలో పూలు వేసి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాళులు
అర్పించారు.అణగారినవర్గాల ఆశాజ్యోతి పూలే
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అనంతపురం : శింగనమల నియోజకవర్గం ఉలికుంటపల్లి విడిది కేంద్రం వద్ద మంగళవారం
జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టిడిపి జాతీయ ప్రధాన
కార్యదర్శి నారా లోకేష్, టిడిపి ముఖ్య నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు.
అణగారినవర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే
జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతిలో నివాళులు అర్పిస్తున్నానన్నారు.
మహిళలు, అట్టడుగువర్గాల ఆత్మగౌరవ పోరాటానికి విద్యనే ఆయుధంగా అందించిన
పూలే మహాశయుని ఆశయసాధనకి కృషి చేయడం మనందరి బాధ్యత అని టిడిపి
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.