టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేగుతున్న నూనెలో వేసి కాస్త ఉప్పు వేసి
అటూ ఇటూ తిప్పుతూ ఉడికించి వంటలు చేసుకోవడం అందరూ చేసేదే. అయితే టమాటలను
కోసినప్పుడు వాటిలో గింజల్ని కూడా కూరలో వేసేస్తాం. అవి కూరలో కలిసిపోతాయి.
దాంతో మనకు తెలియకుండానే మనం టమాటా గింజల్ని తినేస్తాం వాటిని తినవచ్చా?
నిపుణులు ఏమంటున్నారంటే..
పోషకాల గింజలు:
టమాటా గింజల్లో ఫైబర్, విటమిన్స్,మినరల్స్ ఉంటాయి. టమాటా గింజల్లో విటమిన్ C.
K. E ఉంటాయి. ఇవి మనకు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తాయి. టమాటాల్లో గింజల
వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అధికబరువుతో బాధపడేవారు బరువు తగ్గుతారు.
కాబట్టి కూరల్లో టమాటా గింజల్ని తినడం మంచిదే.
ఎవరు తినకూడదు అంటే: కొంతమందికి మాటిమాటికీ కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఏం
తిన్నా అరగదు. అలాంటి వారు టమాటా గింజల్ని తినకూడదు ఎందుకంటే టమాటా గింజల
పైభాగం (పైపొర) గట్టిగా ఉంటుంది. అది తేలిగ్గా జీర్ణం కాదు. అందువల్ల జీర్ణ
సమస్యలు ఎక్కువగా ఉన్నవారు టమాటాల్ని గింజలు తొలగించి వండుకోవడం మేలు.
ఇలా తీసేయండి:
గింజలు తొలగించేందుకు టమాటాను మధ్యలోకి కోసి మధ్యలో ఉన్న గుజ్జును తొలగిస్తే
అందులోని గింజలు కూడా బయటకు వచ్చేస్తాయి. మరోవిధంగా స్పూన్ లేదా చిన్న కత్తితో
గింజల్ని తొలగించవచ్చు.
టమాటో గింజలు తినటం వల్ల ప్రయోజనం:
*టమాటా గింజల్లో లైకోపీన్ (lycopene) ఉంటుంది. ఇది గుండెకు ఆరోగ్యాన్ని
ఇస్తుంది. చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. ధమనుల్లో మంటను తగ్గిస్తుంది.
*టమాటా గింజల్లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు
వ్యర్థాలు, విష వ్యర్థాలను తొలగిస్తాయి మరియు క్యాన్సర్ వంటి రోగాలు కూడా
రాకుండా చేస్తాయి.
*టమాటా గింజలు పొట్ట నిండిన ఫీల్ కలిగిస్తాయి. ఆకలిని తగ్గిస్తాయి కావున అధిక
బరువు పెరగకుండా ఉంటారు. పైగా కొవ్వు కరిగించడం ద్వారా బరువు తగ్గేలా చేస్తాయి.
*టమాటా గింజల్లో కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా ఉండేలా
చేస్తాయి. కీళ్లనొప్పులు, ఎముకలు బోలుగా అవ్వడం (osteoporosis) వంటి సమస్యలు
రాకుండా చేస్తాయి.