మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీ
కోదండరామస్వామివారి అలయం, అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర
స్వామివారి ఆలయం, కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం,
నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆలయాల్లో రథసప్తమి పర్వదినాన
శనివారం అత్యంత వైభంవగా నిర్వహించారు.శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో
తిరుపతి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో శనివారం ఉదయం 7 గంటలకు
సూర్యప్రభవాహనం స్వామివారు భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ
వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ
డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం 6
నుండి 7 గంటల వరకు బంగారు తిరుచ్చిపై స్వామివారు దేవేరులతో కలసి ఆలయ నాలుగు
మాడ వీధుల్లో విహరించారు. అనంతరం ఆలయంలో ఆస్థానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో
ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరిండెంట్ చంగల్ రాయులు,
టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
చంద్రగిరిలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో
చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు
తిరుచ్చిపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు
దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ
డిప్యూటీఈఓ దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థసారథి, సూపరిండెంట్ శ్రీ శ్రీనివాసులు,
ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 గంటల నుండి
మధ్యాహ్నం 1 గంటల వరకు సూర్యప్రభ, హంస, చిన్నశేష, కల్పవృక్ష, పెద్దశేష వాహన
సేవలు, తిరుచ్చి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8
గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ
కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, సూపరిండెంట్ ఏకాంబరం, ఆలయ అర్చకులు,
విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1.30
గంటల వరకు సూర్యప్రభ, హంస, కల్పవృక్షవాహన సేవలు, తిరుచ్చి ఉత్సవంపై స్వామివారు
ఊరేగి భక్తులను కటాక్షించారు. సాయంత్రం 4.30 నుండి రాత్రి 8 గంటల వరకు
శేషవాహనం, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటల నుండి
7 గంటల వరకు తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది.