టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
జాతీయ టిడిపి కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమావేశం
గుంటూరు : మాదిగలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్దికంగా ఎదిగేందుకు టిడిపి కృషి
చేస్తుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం
మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సమావేశంకు ముఖ్య అతిధిగా పాల్గోన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 42 ఏళ్ల నుండి
మాదిగలు టిడిపికి వెన్నుదన్నుగా ఉన్నారని అన్నారు. దామాషా ప్రకారం అన్ని
అవకాశాలు కల్పిస్తాం అన్నారు.
మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ టిడిపినే
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ మాదిగలకు ప్రాధాన్యత
ఇచ్చే పార్టీ టిడిపినే అని అన్నారు. టిడిపిలో మాదిగలు మళ్లీ కీలక పాత్ర
షోషించటం జరుగుతుందన్నారు. గతంలో సామాజికంగా దగపడ్డ జాతికి న్యాయం చేయాలని
వర్గీకరణ కోసం సోదరుడు మంద కృష్ణ ఉద్యమం చేశారు. ఆ ఉద్యమ ఫలితాలు నాలుగు
సంవత్సరాలు అనుభవించాం అది మనందరికి తెలుసు అన్నారు. మాదిగలకు ప్రాధాన్యత
ఇవ్వాలని చంద్రబాబు నాయుడుని కోరాం. మాదిగలకు కీలక పదవులు ఇవ్వాలి. జీవో
నెం.25 నూటికి నూర్లుపాళ్లు అమలు చేయాలని చంద్రబాబు నాయుడుని కోరాం. ఆయన
దానికి అంగీకరించి వర్గీకరణకు సహకరిస్తామని చెప్పారు. కార్పొరేషన్ల విషయంలో
కూడా మాదిగలకు పెద్దపీట వేస్తానని చెప్పడంతో మనము ఆయనకు కృతజ్ఞతలు
తెలియజేయడానికి ఈ మహా కార్యక్రమం ఏర్పాటు చేశాం అన్నారు. మాదిగలంతా ఐక్యంగా
తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని
గెలిపించాలని పిలుపునిచ్చారు.
మాదిగలను గుర్తించింది టిడిపినే : ఎంఎస్ రాజు
టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ మాదిగలకు
మొట్టమొదటిగా ఆర్థికశాఖమంత్రి ఇచ్చి తెలంగాణలో దుర్మార్గమైన పటేల్, పట్వారీ
వ్యవస్థను రద్దు చేసి మాదిగలకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన వ్యక్తి ఎన్టీఆర్
అన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు రాజకీయంగా ఎన్ని అడ్డంకులు ఎదురైన మాదిగల
పక్షాన నిలబడినంటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదిగ, మాదిగ ఉప
కులాలకు దాదాపు 30 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడుది .
దళితుల్లో అన్ని వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందించారు. మొదటి నుంచి నేటి
వరకు మాదిగలకు ఆత్మగౌరవంతో విలువనిస్తున్నంటువంటి పార్టీ టీడీపీ అన్నారు.
చెప్పులు కుట్టుకునే చర్మకారులకు, డప్పు కళాకాకారులకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో
లేని విధంగా మొట్టమొదటిగా పెన్షన్ అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. గత
ప్రభుత్వంలో అమలు చేసిన చర్మకారులకు, డప్పు కళాకాకారుల పెన్షన్ విధానంలో ఈ
ప్రభుత్వంలో అనేక మందికి తొలగించి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని
ఎంఎస్ రాజు ఆరోపించారు.
మాదిగలకు రాజకీయ చైతన్యం తెచ్చింది టిడిపినే : పిల్లి మాణిక్యరావు
టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో
ఎన్నో ఉద్యమాలు పుట్టాయి, ఆరుంధతి ఉద్యమం, దండోరా ఉద్యోమం కాని కేవలం
మాదిగలకు రాజకీయ చైతన్యం తెచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీనే అన్నారు. ఈ
రాష్ట్రానికి ఒక రాక్షసుడు ముఖ్యమంత్రి అయ్యాడు. దీని ముందుగా నష్టపొయ్యేది
మాదిగలేనని గుర్తుచేస్తున్నా అన్నారు. మాదిగలకు రాజకీయంగా ఆర్థికంగా చైతన్యం
అవ్వాలంటే కేవలం అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అన్నారు. కార్యక్రమంలో
మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న, వర్ల కుమార్ రాజా, ఎరిక్ష్సన్ బాబు, కోడూరి
అఖిల్, మేకల దాసు, మందా మురళీ, పులి చిన్నా, తదితరులు పాల్గోన్నారు.