గుంటూరు : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ
దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా వక్తలు మాట్లాడుతూ రాజ్యాంగ
నిర్మాతలు ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పునాదులుగా రాజ్యాంగాన్ని
నిర్మించారని అన్నారు. “రాజ్యాంగం ఎంత మంచిదైన దాన్ని అమలు చేసే పాలకుడు
చెడ్డవాడైతే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుందని, రాజ్యాంగం ఎంత చెడ్డదైన దాన్ని
అమలు చేసే పాలకుడు మంచివాడైతే అది మంచి ఫలితాలు ఇస్తుంది” అని డా. అంబేడ్కర్
1949 లో రాజ్యాంగ సభలో చెప్పారని గుర్తుచేశారు. డా. అండేడ్కర్ నాడు చేసిన
వ్యాఖ్యలు జగన్ రెడ్డి లాంటి పాలకులు భవిష్యత్తు లో వస్తారని ఊహించి చెప్పి
ఉంటారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై 4,800 కోర్టు దిక్కరణ కేసులు ఉన్నాయంటే జగన్
మోహన్ రెడ్డికి రాజ్యాంగంపై ఎంత గౌరవం ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు.
రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం అమలవుతోంది. దళిత రైతులకు బేడీలు వేసిన జగన్
రెడ్డి ప్రభుత్వాన్ని దించితే గానీ రాష్ట్రంలో రాజ్యాంగబద్ద పాలనకు తావుండదని
అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు,
జాతీయ పార్టీ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, మాజీ శాసనమండలి సభ్యులు
ఏ.ఎస్ రామకృష్ణ, అధికార ప్రతినిధులు పిల్లి మాణిక్యాల రావు, సయ్యద్ రఫీ,
ఎన్.ఆర్.ఐ కో-ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు
సునీల్, మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు, పార్టీ నాయకులు దేవినేని
శంకర్ నాయుడు, మునిరత్నం నాయుడు, ఎన్.ఆర్.జి.ఎస్ వీరయ్య, హెచ్.ఆర్.డి సభ్యులు
రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.