నంద్యాల : టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి కుమారుడు ఏవీ చంద్రమౌళి
రెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. చంద్రమౌళి హఠాత్తుగా తీవ్ర
గుండెపోటుకు గురికావడంతో ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు.
మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స అందించినా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస
విడిచారు. అయితే, చంద్రమౌళి మృతిపై ధర్మారెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్
నంద్యాల జిల్లాలోని పారుమంచాల గ్రామానికి వెళ్లి.. ధర్మారెడ్డి కుటుంబ
సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా చంద్రమౌళి రెడ్డి అకాల మరణంపై సీఎం జగన్
ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమౌళి రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి
నివాళులు అర్పించారు.