విజయవాడ : టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ ఆగస్టుతో
ముగుస్తుండటంతో ఆ స్థానంలో వైసీపీలోని బీసీ నేతను కూర్చోబెట్టాలని జగన్
భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామం హర్షించదగ్గదే అయినా దీని వెనుక పెద్ద
రాజకీయ వ్యూహమే ఉందని తెలుస్తోంది. జగన్ ఎంతగానో నమ్ముతున్న ఐ-ప్యాక్ టీం
సూచనతోనే ఈ యోచనలో పడినట్లు సమాచారం. సొంత సామాజిక వర్గానికే పదవులు
కట్టబెట్టారనే విమర్శలను మూటగట్టుకున్న క్రమంలో టీటీడీ చైర్మన్ పదవిని బీసీలకు
ఇచ్చామని ఎన్నికల ముందు కలరింగ్ ఇచ్చుకునేందుకే వైసీపీ సర్కార్ ఈ
నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. ‘నా బీసీలూ, నా ఎస్సీలూ నా ఎస్టీలూ’ అంటూ
ప్రజా వేదికలపై సీఎం జగన్ గొప్పగా చెబుతుంటారు. కానీ, ఆయన ప్రభుత్వంలో ఎస్సీ,
ఎస్టీ, బీసీ మంత్రులకు ప్రాధాన్యం ఉండదు. జిల్లాల్లో ఆ వర్గాలకు చెందిన చాలా
మంది ఎమ్మెల్యేలకు విలువే ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రస్థాయి
నుంచి నియోజకవర్గాల వరకు సొంత సామాజికవర్గానికే ప్రాధాన్యం. పార్టీలో,
ప్రభుత్వంలో రెడ్లను ఒకలా, ఇతర సామాజికవర్గాలను మరొకలా ‘ట్రీట్’
చేస్తుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు, పలు ఉదాహరణలు ఆ పార్టీ నేతలే
చెబుతున్నారు. ఉదాహరణకు పార్టీలో ఏదైనా సమస్య వస్తే రాజ్యసభ సభ్యుడు వేణుంబాక
విజయసాయిరెడ్డి లేదంటే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంతకూ కాదంటే
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రమే వాటిని
పరిష్కరించేలా జగన్ శాసనం చేశారని చెబుతున్నారు. అయితే ఎన్నికలు
సమీపిస్తుండటంతో తాజాగా బీసీల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు తిరుమల వెంకన్న
సాక్షిగా ఓ సరికొత్త వ్యూహం రచించినట్లు సమాచారం. అదేంటో కాదు టీటీడీ
చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ ఆగస్టుతో ముగుస్తుండటంతో ఆ స్థానంలో
వైసీపీలోని బీసీ నేతను కూర్చోబెట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ
పరిణామం హర్షించదగ్గదే అయినా దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని
తెలుస్తోంది. జగన్ ఎంతగానో నమ్ముతున్న ఐ-ప్యాక్ టీం సూచనతోనే ఈ యోచనలో
పడినట్లు సమాచారం. సొంత సామాజిక వర్గానికే పదవులు కట్టబెట్టారనే విమర్శలను
మూటగట్టుకున్న క్రమంలో టీటీడీ చైర్మన్ పదవిని బీసీలకు ఇచ్చామని ఎన్నికల ముందు
కలరింగ్ ఇచ్చుకునేందుకే వైసీపీ సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. ఈ
క్రమంలోనే.. తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పాలక మండలి చైర్మన్ రేసులో
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు తెరపైకి వచ్చింది. ఒకవేళ ఆయనకు టీటీడీ
చైర్మన్ పదవిని కేటాయించినా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయే ప్రమాదం
లేకపోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చీరాగానే అప్పటి టీటీడీ చైర్మన్ పుట్టా
సుధాకర్ యాదవ్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులే ఇందుకు అద్దం పడుతున్నాయి.
ప్రభుత్వం మారితే నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి
అనివార్యంగా ఎదురవుతాయని పుట్టా ఎపిసోడ్ గుర్తు చేస్తోంది. రాబోయే ఏపీ
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైతే జంగాకు టీటీడీ చైర్మన్ పదవి వైసీపీ
సర్కార్ ఇప్పుడు ఇచ్చినా అప్పుడు రాజీనామా చేయక తప్పకపోవచ్చు. అంటే కేవలం
కొన్ని నెలల పాటు మాత్రమే బీసీ నేత టీటీడీ చైర్మన్‌గా కొనసాగే అవకాశం
ఉంటుందనేది స్పష్టమైంది. ఆ తర్వాత సదరు బీసీ నేతనే టీటీడీ చైర్మన్‌గా
కొనసాగుతారో, లేదో గద్దెనెక్కే ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే
టీటీడీ చైర్మన్ పదవి రేసులో పల్నాడు జిల్లాలో జగన్‌కు అత్యంత ఆప్తుడైన జంగా
పేరు వినిపిస్తోంది. యాదవ సామాజికవర్గానికి చెందిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా,
శాసన మండలిలో విప్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత చైర్మన్, సీఎం జగన్
బాబాయి వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని బోర్డు పదవీకాలం ఆగస్టు వరకు ఉంది.
రెండు
సార్లు ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డికి
చైర్మన్‌గా అవకాశమిచ్చినందున ఈసారి బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని
నియమిస్తారని అంటున్నారు.