స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన కేశినేని నాని
విజయవాడ: టీడీపీ పార్టీకి కేశినేని గుడ్ బై చెప్పారు. టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాని ప్రకటించారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. ఇప్పటికే కేశినేని తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. తన రాజీనామాను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన కేశినేని నాని తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అంతకుముందు సీఎం జగన్తో భేటీ అయిన కేశినేని నాని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుచి 2019 వరకు విజయవాడ కోసం చంద్రబాబు రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. విజయవాడ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. బాబు రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ అవబోతుందని చెప్పారు. ఇప్పుడు సీఎం జగన్ ప్రయాణం చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. వైఎస్ జగన్ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు మోసగాడు అని ప్రపంచానికి తెలుసు కానీ మరీ ఇంత పచ్చి మోసగాడు, దగా చేస్తాడని తెలీదని నిప్పులు చెరిగారు. రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్సార్సీపీలో చేరుతానని తెలిపారు.