గుంటూరు : వైయస్సార్ సీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై
ప్రకృతి, పర్యావరణం అంటూ తెలుగుదేశం పార్టీ వికృత రాజకీయం చేస్తోందని రాజ్యసభ
సభ్యులు, వైయస్సార్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి
మండిపడ్డారు..శనివారం ఆయన సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై స్పందిచారు..30
వేల ఎకారాల మూడు పంటలు పండే భూములు,వేల ఎకారాల అటవీ భూములను రాజధాని పేరుతో
రియల్ ఎస్టేట్ దందా చేసినప్పుడు టిడిపికి పర్యావరణం కనబడలేదా అని
ప్రశ్నించారు.. రుషి కొండపై ప్రభుత్వ భూమిలో ఉన్న భవనాల స్ధానంలో అన్ని
అనుమతులతో మరికొంత వైయస్సార్ సిపి ప్రభుత్వం అభివృద్ధి చేస్తే ఏదో
పర్యావరణానికి నష్టం జరిగినట్టు టిడిపి అసత్య ప్రచారం చేస్తోందని
మండిపడ్డారు..”మేము అధికారంలోకి వస్తే వారి అంతుచూస్తాము, అది చేయనివ్వను –
ఇది చేయనివ్వను” అంటూ టీడీపీ విపక్ష నేతలు రోడ్లపై, మీడియాలో చేస్తున్న
వ్యాఖ్యలపై ఆయనతీవ్ర స్థాయిలో మండిపడ్డారు… ఇందుకోసమా ప్రజలు టీడీపీకి వచ్చే
ఎన్నికల్లో ఓట్లెయ్యలి? అని ఆయన ప్రశ్నించారు..
డిజి యాత్ర సౌకర్యన్ని ప్రవేశపెట్టడం హర్షణీయం
ఈ నెల నుంచి ముంబై, అహ్మదాబాద్, కొచ్చి, లక్నో, జైపూర్, గౌహతి విమానాశ్రయాల్లో
కూడా ‘డిజి యాత్ర’ సౌకర్యాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆయన స్వాగతించారు.దీంతో
దేశంలో డిజి ట్రావెల్-ఎనేబుల్డ్ విమానాశ్రయాల సంఖ్య పదమూడుకి పెరుగుతుందని
చెప్పారు. 2023 ఆగస్టు 10 వరకు, 3.46 మిలియన్ల మంది ప్రయాణికులు డిజి యాత్ర
సౌకర్యాన్ని ఉపయోగించారన్న ఆయన రానున్న రోజుల్లో మరింత మంది ప్రయాణికులు ఈ
సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు.