ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిగుంటూరు : కచ్చితంగా టీడీపీది రక్త చరిత్ర.. రౌడీ చరిత్ర పోలీసులు
కొట్టకుండానే డ్రామా చేయండని చెప్పిన చెంగల్రాయుడు..తెలుగు డ్రామా పార్టీ
నడుపుతోన్నది అదే. దాష్టికం అంటే 2014–19 మధ్య బాబు చేసిన దౌర్జన్యాలు,
అరాచకాలు గుర్తు చేసిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి.
పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసిన చరిత్ర చంద్రబాబుది చట్టాన్ని గౌరవించని
చంద్రబాబును ఇంకెవరు గౌరవిస్తారు..?
ప్రెస్మీట్లో సూటిగా ప్రశ్నించిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి
పరాకాష్టకు చేరిన ఉన్మాదం:
టీడీపీ ఉన్మాదం పరాకాష్టకు చేరింది. ఆ పార్టీ నాయకులు వాళ్లే ప్రత్యర్థులపై
దాడులు చేస్తారు. వారే కేసులు పెడతారు. వారే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు.
తప్పును మాత్రం అధికారపార్టీపై నెట్టేసే విచిత్ర సంస్కృతి టీడీపీ
అవలంబిస్తోంది. ఆ పార్టీ అక్రమాలకు సై అంటూ ఈనాడు వంటి పత్రికలు అగ్నికి
ఆజ్యంలా తప్పుడు రాతలతో చెలరేగిపోతున్నాయి.
ఇందుకు తాజా సాక్ష్యం.. విజయవాడ, చుట్టుపక్కల టీడీపీ ఒక ప్రహసనానికి తెర
లేపింది. తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయాలనే
దృక్పథంతో ఇలాంటి మార్గాలను అనుసరిస్తోంది. నిన్న గన్నవరంలో దాడికి తామే
సూత్రధారులుగా, తప్పుడు చర్యలకు పాల్పడి, తద్వారా ఉత్పన్నమయ్యే పరిణామాలకు
తిరిగి ప్రభుత్వాన్నే బాధ్యురాలిగా చేస్తూ, రాష్ట్రంలో ఏదో ఒక జరిగిపోతుందన్న
భ్రమలను కలిగిస్తోంది. ఎన్నికల వరకు లేనిపోని హామీలు ఇవ్వడం, అధికారంలోకి
వచ్చిన తర్వాత చెత్తబుట్టలో పడేయడం.. లేదా ప్రతిపక్షం అధికారంలోకి వస్తే
ఎదురుదాడి చేయడం.. వ్యక్తిత్వ హననానికి పాల్పడడం.. ఇలాంటి అక్రమాలకు పాల్పడే
టీడీపీని అడ్డగోలుగా ఈనాడు, విషపదార్థం లాంటి ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా
సమర్థించడం ఇదే వీరికి తెలిసిన విద్య.
ఈ మీడియా టెర్రరిజం సృష్టించే విస్ఫోటం ఆర్డీఎక్స్ కంటే ప్రమాదకరంగా మారింది.
టీడీపీకి, ఈ ఎల్లో మీడియాకు రాష్ట్రం విడిపోయిందన్న బాధ లేదు. రాష్ట్ర
సంక్షేమం పట్టదు. తెలిసిందల్లా తప్పుడు రాతల విద్య ఒక్కటే. ప్రజల బాగోగులు
వీరికి అవసరం లేదు.
సుపరిపాలనపై కుట్రలు:
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం శ్రీ వైయస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యం
టీడీపీకి మింగుడు పడడం లేదు. తాజాగా ఎమ్మెల్సీ స్థానాల్లో 11 మంది బీసీలను
జగన్ గారు ఎంపిక చేయడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేక పోయింది. ఇదే కాకుండా
ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగనివ్వకుండా చేయాలన్న
తప్పుడు ఆలోచనలతో టీడీపీ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతోంది.
జనం దృష్టి మళ్లించే కుతంత్రాలు:
ఒక వైపు జగన్‌గారు జనానికి చేసే మంచి నుంచి ఎలాగైనా దృష్టి మళ్లించడానికి
టీడీపీ వారే అధికారపార్టీ నాయకులను రెచ్చగొట్టి, దాడులు చేస్తూ.. తిరిగి ఆ
తప్పును ప్రభుత్వంపై నెట్టేయడం టీడీపీకి పరిపాటిగా మారింది. గత ఏడాది ఇలాగే
జరిగింది. ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న ఏడాదిలో ఇలాంటివి చేస్తోంది.