ర్యాలీలు నిర్వహించాలని వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ మేరకు
మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాలతో
పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నాయకులు సోమవారం స్థానిక భవానీపురం లోగల ఎన్టీఆర్
జిల్లా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ
నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిధులుగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గ
గుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు పల్లపోతూ
మురళి కృష్ణ (కొండపల్లి బుజ్జి), విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి
శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పేదలకు అమరావతిలో ఇచ్చిన
భూములను స్మశానలతో పోలచడం చంద్రబాబు కి సబబు కాదన్నారు.రాబోయే కాలంలో
చంద్రబాబు కి రాష్ట్ర ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెపుతారు అని హెచ్చరించారు.
రాష్ట్రం నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. జగనన్న మా సొంత
ఇంటి కల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. అచ్చన్నాయుడు మాటలు హేయం
అన్నారు. తెలుగుదేశం నాయకులకు తగిన రీతిలో బుద్ది చెపుతామన్నారు. ఈ
కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు చేర్మెన్ గౌస్
మొహిద్దీన్,కార్పొరేటర్లు యారాడ్ల ఆంజనేయ రెడ్డి,బాపతి కోటిరెడ్డి, ఇర్ఫాన్,
మరుపిళ్ల రాజేష్,గుడివాడ నరేంద్ర, శిరంశెట్టి పూర్ణ, యాలకల చలపతిరావు,
అర్షద్,తంగెళ్ల రాము,రాయన నరేంద్ర, మైలవరపు కృష్ణ, హయత్, జీఎంసీ బాషా,రాష్ట్ర
స్థాయి డైరెక్టర్లు చంద్రశేఖర్, మద్దెల రామకృష్ణ,దాడి అప్పారావు, బుద్దా
రాంబాబు, కట్ట సత్యయ్య, కూరాకుల నాగ, కేసరి చిన్న సుబ్బారెడ్డి, హబిబ్బులా,
కేసరి కృష్ణ రెడ్డి, షకీల్, నాళం నాగేశ్వర రావు, వానపల్లి త్రిమూర్తులు వివిధ
కార్పొరేషన్ల డైరక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.