భవిష్యత్ కు గ్యారెంటీపథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాష్ట్రవ్యాప్తంగా
బస్సుప్రచారం
19న 5 బస్సుల్ని ప్రారంభించనున్న చంద్రబాబు నాయుడు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
గుంటూరు : సంక్షేమం ముసుగులో ప్రజల్ని కడుబీదలుగా మార్చిన జగన్ , రాష్ట్రాన్ని
సంక్షోభంలోకి నెట్టాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ఆరోపించారు. చంద్రబాబు భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో ప్రకటించిన పథకాలు
ప్రజలజీవితాలకు కొత్తఊపిరిలూదాయని, చంద్రబాబు మహానాడువేదికగా ప్రకటించిన
భవిష్యత్ కు గ్యారెంటీపథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాష్ట్రవ్యాప్తంగా
బస్సుప్రచారం చేపట్టనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
వెల్లడించారు. 5 బస్సుల్ని చంద్రబాబు 19వతేదీన పార్టీ జాతీయకార్యాలయంలో
ప్రారంభిస్తారని, టీడీపీ మేనిఫెస్టో ప్రచారబస్సులు 125 నియోజకవర్గాల్లో
తిరగనున్నాయని తెలిపారు. నియోజకవర్గాలఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు బస్సుల్లో
వెళ్లి ప్రజలతో మమేకమై, చంద్రబాబువారికోసం ప్రకటించిన పథకాల్ని తెలియచేస్తారు.
అలానే జగన్ పాలనలో ప్రజలకు జరిగిన నష్టం, వారుపడుతున్న కష్టాలను తెలుసుకొని,
భవిష్యత్ లో చేపట్టబోయే కార్యక్రమాలదిశగా ఆలోచిస్తారు. వారి ఆలోచనల్ని పార్టీ
అధినేతతో పంచుకుంటారు. రాష్ట్ర ఆదాయం పెంచి ప్రజలకు పంచి, పేదల్నిధనవంతుల్ని
చేసే బృహత్తర కార్యక్రమమే చంద్రబాబు ప్రకటించిన ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ పథకం.
టీడీపీ మేనిఫెస్టో పులిహోరలాంటిదన్నజగన్, పులిహోరపేదలకు బలాన్ని,
ఆరోగ్యాన్ని అందిస్తుందో ఆయన మాటల్తోనే ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని
మించిన యాక్టర్ ప్రపంచంలో మరొకరుఉండరు. కేంద్రప్రభుత్వంతో జగన్ కు
సన్నిహితసంబంధాలు ఉండబట్టే 4ఏళ్లుగా అవినీతికేసుల విచారణకు కోర్టులకు
వెళ్లడంలేదు. కేంద్ర పెద్దల అండతోనే బాబాయ్ హత్యకేసులో అసలు ముద్దాయిల్ని
సీబీఐ అరెస్ట్ లనుంచి కాపాడుకోగలుగుతున్నాడు. బీజేపీ సహాయసహాకారాలుండబట్టే
ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి మించి అప్పులుతెచ్చి, ఆ సొమ్ములో 90శాతం దిగమింగాడని
అచ్చెన్నాయుడు విమర్శించారు.
వైసీపీప్రభుత్వం సంక్షేమంముసుగులో పేదల్ని కడుబీదలుగా మార్చిందని,
నాలుగన్నరేళ్లపాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతిఒక్కరిపై
రూ.2.05లక్ష ల అప్పువేశాడని, నిత్యావసరాలధరల పెంపుతోపాటు, ఇతరత్రాపన్నులు వేసి
ప్రజల్ని లూఠీచేస్తున్నాడని, కేంద్రంనుంచి ఇతరత్రామార్గాల్లో తీసుకొచ్చే
అప్పుల్లో 90శాతంసొమ్ముని ప్రభుత్వమే దోచేస్తోందని టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు
కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో
బుధవారం ఆయన టీడీపీబీసీ సెల్ రాష్ట్రఅధ్యక్షులు, మాజీమంత్రి కొల్లురవీంద్ర,
ఎమ్మెల్యే అనగానిసత్యప్రసాద్, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, పంచుమర్తి
అనురాధ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి లతో కలిసి ‘బీసీ
భరోసా లోగో’ పోస్టర్లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ముసుగులోప్రజల్ని దోచేస్తూ, రాష్ట్రాన్ని సంక్షోభం
లోకి నెట్టాడు. జగన్ దోపిడీతో అటుప్రజలు, ఇటురాష్ట్రం విచ్ఛిన్నమైన నేపథ్యం లో
టీడీపీఅధినేత చంద్రబాబుగారు మహానాడువేదికగా విప్లవాత్మకనిర్ణయం తీసుకొని
రాష్ట్రంలోని అన్నివర్గాలసంతోషమే లక్ష్యంగా భవిష్యత్ గ్యారెంటీ పేరుతో
మినీమేనిఫెస్టో ప్రకటించారు. ఆయనప్రకటించిన పథకాలు ప్రజలజీవితాలకు కొత్త
ఊపిరిలూదాయని చెప్పడం అతిశయోక్తికాదు. సమాజంలో సగభాగమున్న మహిళల్నిఆర్థికంగా
నిలదొక్కుకునేలా చేస్తే, కుటుం బాలతోపాటు, రాష్ట్రంకూడా త్వరితగతిన
అభివృద్ధిచెందుతుందని భావించిన చంద్రబాబు, మహాశక్తిపేరుతో మహిళలకు వరాలు
ప్రకటించారన్నారు.
విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వమని టీడీపీప్రభుత్వం
నాలుగేళ్లుమొత్తుకున్నా కేంద్రం రూపాయిఇవ్వలేదు. టీడీపీప్రభుత్వానికి
ఇవ్వాల్సిన నిధుల్ని ఇప్పుడు మొన్న టికి మొన్న జగన్ ప్రభుత్వానికి
రూ.12వేలకోట్లు ఇచ్చారు. బీజేపీకి, జగన్ కుమధ్య ఎంతగొప్ప అండర్ స్టాండింగ్
లేకపోతే ఇదిసాధ్యమైంది? ఇదంతా జగన్, అతనిప్రభుత్వం ఆడుతున్నడ్రామానే.
జగన్మోహన్ రెడ్డిపై, అతనిప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతఉంది. జగన్ ,
అతనిప్రభుత్వం మునిగిపోయే నావల ని అర్థంకావాల్సిన వారికి అర్థమైంది.
ప్రధానమంత్రి తరువాత ప్రధానమంత్రిగా కీర్తించబడే అమిత్ షా, జగన్మోహన్
రెడ్డిని మించిన అవినీతిపరుడు దేశంలోనే లేడనిచెప్పాడు. ఆయనవ్యాఖ్యలపై
ముఖ్యమంత్రి స్పందించాలి. కానీ నోరెత్తలే దు. తనపార్టీవారితో ఇష్టమొచ్చినట్లు
అమిత్ షాను, టీడీపీని తిట్టించాడు. అమి త్ షా వ్యాఖ్యలతో టీడీపీకి ఏంసంబంధం?
ప్రజలు జగన్ డ్రామాలను నమ్మేస్థితి లో లేరు. తనబాబాయ్ ని చంపినవారిని
శిక్షిస్తే జగన్ ను ప్రజలు నమ్ముతారు. తన అవినీతి కేసుల్లో నిజాయితీగా,
చట్టప్రకారం వ్యవహరిస్తే నమ్ముతారని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు. బీసీ
భరోసాలోగో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ బీసీ అనుబంధ విభాగాలనేతలు,
సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.