అనంతపురం : కమ్మూరులో బీసీ సంఘాల ప్రతినిధులతో టీడీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. టీడీపీ రాగానే బీసీ
రక్షణ చట్టం తెస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు.. న్యాయపోరాట ఖర్చు కూడా
ప్రభుత్వమే భరిస్తుందని, నియోజకవర్గాల వారీగా బీసీ రెసిడెన్షియల్ కాలేజీలు
ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
ఉరవకొండ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
పర్యటిస్తున్నారు. కూడేరు క్యాంప్ సైట్ నుంచి 62వ రోజు యువగళం పాదయాత్రను నారా
లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు ఉదయాన్నే సెల్ఫీ విత్ నారా
లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెయ్యి మందితో మొదలైన సెల్ఫీ విత్ నారా
లోకేష్ కార్యక్రమం ఇప్పుడు రెండు వేల మందికి చేరుకుంది. లోకేష్‌తో ఫోటో
దిగేందుకు ఉదయం 5.30 కే లోకేష్ క్యాంప్ సైట్‌కి ప్రజలు చేరుకుంటున్నారు.