నాకు పదవులు ముఖ్యం కాదు.. ఆత్మాభిమానం ముఖ్యం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ
హైదరాబాద్ : టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి మాజీ మంత్రి, కాంగ్రెస్
నాయకురాలు కొండా సురేఖ రాజీనామా చేశారు. టీపీసీసీ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం
చేస్తూ కొండా సురేఖ రాజీనామా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తనపేరు
లేదని, అలాగే వరంగల్‌కు చెందిన ఏ ఒక్క లీడర్ పేరు కూడా లేకపోవడం మనస్థాపాన్ని
కలిగించిందన్నారు. తనకంటే జూనియర్లకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో స్థానం
కల్పించారని.. ఇది తనను అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఎగ్జిక్యూటివ్ కమిటీలో నన్ను వేయడం బాధించింది. ఇందులో రాజకీయ భవిష్యత్తు
కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోపాటు కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని
వారిని నామినేట్ చేసిన కమిటీలో నన్ను వేయడం అవమానపర్చినట్లుగా
భావిస్తున్నాను. మాకు పదవులు ముఖ్యం కాదు. ఆత్మాభిమానం ముఖ్యం. నమ్ముకున్న
వారి కోసం ఒకానొక సమయంలో మంత్రి పదవినే వద్దు అనుకున్న దాన్ని. ‘35
సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఏ రోజు
కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించలేదు. ఎప్పుడూ పార్టీ
అభివృద్ధి కోసమే సొంత ఖర్చులతో పనిచేశాము. నమ్మిన పార్టీ కోసం ఏ చేయడానికి
అయినా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను ఈ కమిటీలో కంటిన్యూ కాలేను. అందుకే
తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా రాజీనామా చేస్తున్నాను.
వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ
అభివృద్ధికి కృష్టిచేస్తూ ఒక సామాన్య కార్యకర్తలా కాంగ్రెస్‌లో కొనసాగుతా’ అని
కొండా సురేఖ వెల్లడించారు.
కాంగ్రెస్‌లో కమిటీల కలకలం : ఏఐసీసీ వేసిన తెలంగాణ ప్రదేశ్ కమిటీలు తనకు
అసంతృప్తిని కలిగించాయని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈమేరకు టీపీసీసీ
అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రదేశ్
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ‘‘తెలంగాణ
పీఏసీలో నా పేరు లేకపోవడమే కాదు వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ నాయకుడి పేరు
లేకపోవడం మనస్తాపం కలిగించింది. తెలంగాణ ప్రదేశ్ రాజకీయ వ్యవహారాల కమిటీలో
నాకంటే జూనియర్లకు అవకాశం ఇచ్చారు. నన్ను మాత్రం తెలంగాణ ప్రదేశ్
ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా నియమించడం జీర్ణించుకోలేకపోతున్నా.తెలంగాణ
ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నన్ను నియమించడం అవమానపరిచినట్టుగా
భావిస్తున్నా. నాకు పదవులు ముఖ్యం కాదు. ఆత్మాభిమానం ముఖ్యం. మా కుటుంబం 34
ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఉమ్మడి వరంగల్
జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అభిమానించే వారు ఉన్నారు. రాజకీయ
వ్యవహారాల కమిటీలో రాజకీయ బతుకుదెరువుకోసం మూటముల్లె సర్దుకుని ఇతర పార్టీల
నుంచి వచ్చిన వారితో నిండిపోయింది. కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని
వాళ్లను, నామినేట్ చేసిన కమిటీలో నన్ను నామినేట్ చేయడం అవమానపర్చినట్టుగా
భావిస్తున్నా. నేను, నా భర్త వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గ ప్రజలకు
అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సామాన్య కార్యకర్తలుగా
కొనసాగుతామని కొండా సురేఖ లేఖలో పేర్కొన్నారు.