ఆదిలోనే వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
404 పరుగులకు ఆలౌటైన భారత్
హాఫ్ సెంచరీ చేసిన అశ్విన్
తొలి బంతికే వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ
స్కోరును సాధించింది. 404 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న ప్రారంభమైన ఈ మ్యాచ్
లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. మన టీమ్ లో
ముగ్గురు ఆటగాళ్లు అర్ధ శతకాలను సాధించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 22
పరుగులకు, శుభ్ మన్ గిల్ 20 పరుగులకు పెవిలియన్ చేరారు. ఇతర బ్యాట్స్ మెన్లలో
చటేశ్వర్ పుజారా 90, కోహ్లీ 1 పరుగు, రిషభ్ పంత్ 46, శ్రేయస్ అయ్యర్ 86,
అక్సర్ పటేల్ 14, రవిచంద్రన్ అశ్విన్ 58, కుల్దీప్ యాదవ్ 40, ఉమేశ్ యాదవ్ 15
(నాటౌట్), మొహమ్మద్ సిరాజ్ 4 పరుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో 8 పరుగులు
వచ్చాయి. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం, హసన్ మిరాజ్ లు చెరో 4 వికెట్లు
తీయగా, ఎబాదత్ హుస్సేన్, ఖలీద్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. అనంతరం తొలి
ఇన్నింగ్స్ ను ప్రారంభించిన బంగ్లాదేశ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి
ఓవర్ వేసిన సిరాజ్ తొలి బంతికే నజ్ముల్ హుస్సేన్ ను ఔట్ చేశాడు. సిరాజ్
బౌలింగ్ లో కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్
స్కోరు ఒకెట్ నష్టానికి 4 పరుగులు.