భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ – గవాస్కర్ టెస్ట్ సిరీస్ జరుగుతున్న
సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా జరగాల్సిన మూడో టెస్ట్ వేదికను ధర్మశాల
నుంచి ఇండోర్ కు మార్చారు. ఈ విషయాన్ని ఈరోజు బీసీసీఐ ప్రకటించింది. హిమాలయ
పర్వత శ్రేణుల్లో ఉన్న ధర్మశాలలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ
నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మార్చ్ 1 నుంచి 5వ తేదీ వరకు మూడో టెస్ట్
జరగనుంది. ధర్మశాల స్టేడియంలో ఔట్ ఫీల్డ్ మ్యాచ్ ఆడేందుకు అనుగుణంగా లేదని
బీసీసీఐ క్యూరేటర్ తపోష్ చటర్జీ నిన్న బీసీసీఐకి నివేదికను అందించారు.
ప్రతికూల వాతావరణం కారణంగా ఔట్ ఫీల్డ్ లో గడ్డి సరిగా పెరగలేదని ఆయన తెలిపారు.
మరోవైపు 4 టెస్ట్ ల ఈ సిరీస్ లో ఇండియా 1-0 లీడ్ లో ఉంది. నాగ్ పూర్ లో జరిగిన
తొలి టెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది.
రెండో టెస్ట్ ఫిబ్రవరి 17న ఢిల్లీలో ప్రారంభంకానుంది. చివరి టెస్ట్ మార్చ్ 9వ
తేదీ నుంచి అహ్మదాబాద్ లో జరుగుతుంది.