ఇండియా, శ్రీలంక మధ్య శనివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో
సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుంది.91 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
శ్రీలంక బౌలర్లను ఊచకోత కోస్తూ.. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. గిల్ 46,
త్రిపాఠి 35, అక్షర్ పటేల్ 21 పరుగులు చేయగా.. వీరికి తోడు సూర్య కుమార్
మెరుపు సెంచరీ చేయడంతో టీమిండియా 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక
బౌలర్లలో మధుశనక 2 వికెట్లు తీయగా.. హసరంగా, రజిత, కరుణారత్నే తలా ఓ వికెట్
సాధించారు. అనంతరం 229 పరుగుల భారీ టార్గెట్ బరిలోకి దిగిన శ్రీలంక 137
పరుగులకే చాపచుట్టేసింది. ఓపెనర్లు నిస్సాంకా 15, కుశాల్ మెండిస్ (23) కాసేపు
భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. అనంతరం క్రీజ్‌లో వచ్చిన బ్యాటర్లు వరుసగా
పెవిలియన్ బాట పట్టారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్ల తీయగా..
చాహల్, ఉమ్రాన్ మాలిక్, హర్ధిక్ పాండ్యా తలో రెండు వికెట్లు తీశారు. యంగ్ ఆల్
రౌండర్ అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించాడు. ఈ విజయంతో భారత్ 2-1 తేడాతో టీ20
సిరీస్‌ను కైవసం చేసుకుంది.స్కోరు బోర్డు – భారత్ 5 వికెట్లకు 228 (సూర్యకుమార్ యాదవ్ 112*, శుభ్‌మన్
గిల్ 46, రాహుల్ త్రిపాఠి 35; కసున్ రజిత 1/35) – శ్రీలంక 137 (కుసల్ మెండిస్
23, దాసున్ షనక 23; అర్ష్‌దీప్ సింగ్ 3/20).