టీమిండియా యంగ్ బ్యాట్స్‌మన్ కమ్ వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌కు టాలెంట్ ఉన్నా
తగిన అవకాశాలు దక్కడంలేదనేది ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో హాట్ టాపిక్.
న్యూజిలాండ్ టూర్‌కు ఎంపికైనా టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా
చోటుదక్కకపోవడం ఇందుకు నిదర్శనం. సంజూపై వివక్షచూపుతున్నారని, కావాలనే అతడిని
పక్కనపెడుతున్నారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తమ
అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే టాపిక్‌పై టీమిండియా స్పిన్నర్
రవిచంద్రన్ అశ్విన్ కూడా స్పందించాడు. సంజూకి అవకాశాలు దక్కకపోవడంపై
మాట్లాడాడు. ‘‘ అతడికి (సంజూశాంసన్) ఉన్న టాలెంట్‌కి తుది జట్టులో ఆడకపోతే
ఖచ్చితంగా ట్రెండింగ్ అవుతాడు. సంజూకి అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నా.
నిజానికి ప్రస్తుతం అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి ఆడాలనుకుంటున్నా.
చాలా బాగా ఆడుతున్నాడు’’ అని అశ్విన్ అన్నాడు. తన యూట్యూబ్ చానల్లో ఈ మేరకు
కామెంట్స్ చేశాడు. సంజూ ఆడుతుంటే చూడడం అద్భుతంగా ఉంటుందని అన్నాడు. ‘‘ టీ20
సిరీస్‌లో సంజూకు చోటుదక్కకపోవడంపై పాండ్యా మాట్లాడుతూ వేర్వేరు
కాంబినేషన్స్‌లో వెళ్తుంటామని చెప్పాడు. అయితే సంజూకు ఎందుకు చోటివ్వలేదో
చెప్పాలి’’ అని హార్ధిక్ పాండ్యాపైనా అశ్విన్ స్పందించాడు.