టూరిజం ప్రమోషన్ లో బాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలైనా కర్నాటక, రాజస్థాన్ ల
పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్
సమావేశమయ్యారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలో వివిధ రాష్ట్రాల
మధ్య సమన్వయమ ఎంతో అవసరమని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
దేశానికి వచ్చిన పర్యాటకులకు వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాముఖ్యత కలిగిన
టూరిజం కేంద్రాల సమాచారాన్ని అందించాలని కోరారు. అయా రాష్ట్రాల టూరిజం
అధికారులు సమన్వయము చేసుకుని టూరిస్టుల ను ఆకర్షించేందుకు సహకరించుకోవాలని
పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి , పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనకు
చేపట్టుతున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు
తెలంగాణ టూరిజం ప్రాంతాల పట్ల నిర్లక్ష్యం వహించారన్నారు. తెలంగాణ రాష్ట్రం
ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేయడం వల్ల రామప్ప
దేవాలయం యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. అలాగే, పోచంపల్లి గ్రామం బెస్ట్
టూరిజం విల్లేజ్ గా ఎంపికైందన్నారు . తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి
చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని రాజస్థాన్,
కర్ణాటక రాష్ట్రాల టూరిజం ఉన్నతాధికారులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని
అభినందించారు.
రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, క్రీడ, పర్యాటక ,సాంస్కృతిక, పురావస్తు, యువజన
సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్
లో జరుగుతున్న ప్రపంచ ట్రావెల్ అండ్ టూరిజం మీట్ లో రెండవ రోజు స్పెయిన్
రాజదాని మాడ్రిడ్ లో పర్యాటక రంగం అభివృద్ధి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో
పర్యాటకులను ఆకర్షించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు, పర్యాటక కేంద్రాల
ప్రాముఖ్యతను తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, వారసత్వ సంపద,
పర్యాటకులకు కనువిందు చేసే అద్భుతమైన ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు,
సెలయేర్లు, దేవాలయాలు, వైల్డ్ టూరిజం, ఎకో టూరిజం, ట్రైబల్ టూరిజం, ట్రైబల్
సాంస్కృతి, మెడికల్ టూరిజం , బతుకమ్మ పండుగ గొప్పదనం లాంటి ఎన్నో ప్రత్యేకతలు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయనీ కర్నాటక, రాజస్థాన్ రాష్ట్రాల టూరిజం అధికారులతో
జరిగిన మర్యాద పూర్వక సమావేశంలో వెల్లడించారు. దేశంలోనీ అన్ని రాష్ట్రాల
టూరిజం శాఖల మధ్య పర్యాటకులను ఆకర్షించేందుకు సమన్వయం ఉండాలని మంత్రి డాక్టర్
వి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు.