ఆక్లాండ్ : ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను న్యూజిలాండ్‌కు
అందించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్టు సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు.
అతడు ఇక పూర్తిగా వన్డే, టీ20లపైనే దృష్టిసారించనున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్
కెప్టెన్సీ నుంచి కేన్ వైదొలిగినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
అతని స్థానంలో పేసర్ టిమ్ సౌథీకి బాధ్యతలు అప్పగించింది. 2023 వన్డే
ప్రపంచకప్, 2024 టీ20 వరల్డ్‌కప్‌లలో కేన్ సారథ్యంలోనే కివీస్ బరిలో
దిగుతుంది. మూడు ఫార్మాట్లలో టామ్ లేథమ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 40
మ్యాచ్‌ల్లో 22 విజయాలు, 8 డ్రాలు, కేవలం 10 పరాజయాలతో కివీస్ చరిత్రలో
అత్యుత్తమ టెస్టు కెప్టెన్‌గా కేన్ రికార్డు నెలకొల్పాడు. అతని నాయకత్వంలోనే
టెస్టుల్లో కివీన్ నంబర్‌వన్ ర్యాంకు సొంతం చేసుకుంది. నిరుడు జూన్‌లో
జరిగిన ఫైనల్లో టీమ్ఇండియాపై గెలుపుతో డబ్ల్యూటీసీ టైటిల్ సాధించింది.
కివీస్‌కు 31వ టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన సౌథీ ఈనెలలో పాకిస్థాన్‌లో పర్యటనతో
జట్టును నడిపించనున్నాడు.